AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేవలం సిగరెట్ ప్యాకెట్‌ కోసం కాల్పులు.. అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు యువకుడు!

అమెరికాలో గన్ కల్చర్‌ ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఇప్పుడు ఈ న్యూస్‌ ఒక ఉదాహరణ. ఉన్నట్టుండి ఒకడొచ్చాడు. తుపాకీతో గురి పెట్టాడు. ధనాధన్‌ కాల్చేశాడు. వాడికి కావాల్సిన సిగరెట్ ప్యాకెట్‌ పట్టుకెళ్లిపోయాడు. కేవలం సిగరెట్ ప్యాకెట్‌ కోసం కాల్పులు జరపడం సెన్సేషన్‌గా మారింది.

కేవలం సిగరెట్ ప్యాకెట్‌ కోసం కాల్పులు.. అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన తెలుగు యువకుడు!
Gopikrishna
Balaraju Goud
|

Updated on: Jun 23, 2024 | 11:32 AM

Share

అమెరికాలో గన్ కల్చర్‌ ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఇప్పుడు ఈ న్యూస్‌ ఒక ఉదాహరణ. ఉన్నట్టుండి ఒకడొచ్చాడు. తుపాకీతో గురి పెట్టాడు. ధనాధన్‌ కాల్చేశాడు. వాడికి కావాల్సిన సిగరెట్ ప్యాకెట్‌ పట్టుకెళ్లిపోయాడు. కేవలం సిగరెట్ ప్యాకెట్‌ కోసం కాల్పులు జరపడం సెన్సేషన్‌గా మారింది. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయింది తెలుగు విద్యార్థి కావడం అందరినీ షాక్‌కి గురి చేస్తోంది.

డల్లాస్‌‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు విద్యార్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ (32)గా గుర్తించారు. కర్లపాలెం మండలం యాజలికి చెందిన గోపీకృష్ణ జీవనోపాధి కోసం 8 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. ఎమ్మెస్ పూర్తి చేసిన గోపీకృష్ణ, మంచి ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం ఆర్కెన్సాస్‌లోని ఓ సూపర్‌ మార్కెట్‌లో పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం గోపీకృష్ణ కౌంటర్‌లో ఉండగా, స్టోర్‌లోకి దూసుకువచ్చిన ఓ అగంతకుడు తుపాకీతో గురి పెట్టి అతడిపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడ్డ గోపీ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. అనంతరం దుండగుడు ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు.

రక్తపు మడుగులో పడి ఉన్న గోపీకృష్ణను ఇతర స్టోర్ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఉపాధి కోసం వెళ్లి విదేశాల్లో ప్రాణాలు విడిచాడని తెలిసి అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతోంది. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. గోపీ స్వగ్రామం యాజలిలో విషాదఛాయలు అలముకున్నాయి. మరోవైపు దుండగుడు కాల్పులు జరిపిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.

వీడియో…

గోపీకృష్ణ హత్య కేసులో నిందితుడి వయసు కూడా 16 ఏళ్లే. వాడు స్టోర్‌లోకి వస్తూనే పలు రౌండ్లు కాల్పులు జరిపాడు. రావడంతోనే పాయింట్‌ బ్లాంక్‌ రేంజ్‌లో గన్‌ పెట్టి కాల్చడం మొదలుపెట్టారు దుండగుడు. గోపి స్పాట్‌లోనే కుప్పకూలిపోయాడు. తర్వాత కౌంటర్‌లోకి వచ్చి.. సిగరెట్‌ ప్యాకెట్ తీసుకుని పారిపోయాడు. అదే స్టోర్‌లో పనిచేస్తున్న వారు వెంటనే అంబులెన్స్‌లో గోపీని ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us