PM Modi in Brunei: బ్రూనై పర్యటనతో ప్రధాని మోదీ రికార్డ్.. ఘన స్వాగతం పలికిన క్రౌన్ ప్రిన్స్

భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రూనై పర్యటనలో ఉన్నారు. బ్రూనై సుల్తాన్ హాజీ హసనల్ బల్కియా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఇక్కడికి చేరుకున్నారు. బ్రూనై పర్యటన చేసిన మొదటి భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. క్రౌన్ ప్రిన్స్ అల్-ముహతాది ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు.

Follow us

|

Updated on: Sep 03, 2024 | 3:52 PM

భారత ప్రధాని నరేంద్ర మోదీ బ్రూనై పర్యటనలో ఉన్నారు. బ్రూనై సుల్తాన్ హాజీ హసనల్ బల్కియా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఇక్కడికి చేరుకున్నారు. బ్రూనై పర్యటన చేసిన మొదటి భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. క్రౌన్ ప్రిన్స్ అల్-ముహతాది ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. భారత ప్రధానిగా తొలి ద్వైపాక్షిక పర్యటన ఇదే కావడం విశేషం.

ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి మూడు రోజులపాటు బ్రూనై, సింగపూర్‌లో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 3, 4 తేదీల్లో ప్రధాని మోదీ బ్రూనైలో పర్యటిస్తారు. భారత ప్రధాని బ్రూనైలో పర్యటించడం ఇదే తొలిసారి. భారత్ – బ్రూనై మధ్య దౌత్య సంబంధాలు 40 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన కొనసాగుతోంది. బ్రూనై పర్యటన అనంతరం ప్రధాని మోదీ సింగపూర్ వెళ్లనున్నారు. సింగపూర్ ప్రధాని ఆహ్వానం మేరకు ఆయన ఆ దేశాన్ని సందర్శించనున్నారు.

వీడియో చూడండి..

బ్రూనై ఒక ముస్లిం దేశం. బ్రూనైలో 2021 జనాభా గణన ప్రకారం 44 లక్షల మందికి పైగా ముస్లిం ప్రజలు నివసిస్తున్నారు. జనాభాలో 82 శాతం మంది ముస్లింలు, 8 శాతం క్రైస్తవులు, 7 శాతం బౌద్ధులు, 4 శాతం ఇతర మతాల వారు ఉన్నారు. భారతీయులు చరిత్ర సృష్టిస్తున్న దేశాల్లో బ్రూనై ఒకటి. ఇక్కడ చాలా మంది భారతీయులు వైద్యం, విద్యా బోధన, ఇంధన రంగాలతో సంబంధం కలిగి ఉన్నారు. భారత హైకమిషన్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, 14,500 మంది భారతీయులు ఇక్కడ పనిచేస్తున్నారు. అందులో ఎక్కువ మంది ఉపాధ్యాయులు, వైద్యులు ఉన్నారు. బ్రూనై దారుస్సలాంలో అత్యధిక సంఖ్యలో ప్రవాస భారతీయులు నివసిస్తున్నారు. భారతీయులు ఇక్కడికి వచ్చి పని చేయడం కొత్త కాదు. ఇది 1930 నుండి ప్రారంభమైంది. దీని తరువాత, ఎన్నారైలు ఇక్కడ పనిచేశారు. వివిధ రంగాలలో తమ సహకారాన్ని అందించారు. బ్రూనై కూడా వారి సహకారాన్ని గుర్తించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

మహిళా వేధింపుల కమిటీపై హీరోయిన్ కామెంట్స్.! ఎలాంటి కమిటీలు వద్దు!
మహిళా వేధింపుల కమిటీపై హీరోయిన్ కామెంట్స్.! ఎలాంటి కమిటీలు వద్దు!
రోగికి ‘అదుర్స్‌’ సినిమా చూపిస్తూ.. మెదడులోని కణితి తొలగింపు
రోగికి ‘అదుర్స్‌’ సినిమా చూపిస్తూ.. మెదడులోని కణితి తొలగింపు
తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..శుభవార్త ఎలా చెప్పిందో చూశారా?
తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్..శుభవార్త ఎలా చెప్పిందో చూశారా?
రిలీజ్‌కు ముందే రికార్డ్స్‌ క్రియేట్ చేసిన దేవర|అసలు ఏది నమ్మాలి?
రిలీజ్‌కు ముందే రికార్డ్స్‌ క్రియేట్ చేసిన దేవర|అసలు ఏది నమ్మాలి?
వెంకన్న భక్తులకు అన్నప్రసాదం ఆ దాతల చలువే.. దాతలకు ఘన సన్మానం
వెంకన్న భక్తులకు అన్నప్రసాదం ఆ దాతల చలువే.. దాతలకు ఘన సన్మానం
మంకీపాక్స్ అలర్ట్.. దేశంలో మరో అనుమానిత కేసు..
మంకీపాక్స్ అలర్ట్.. దేశంలో మరో అనుమానిత కేసు..
సెల్ఫ్ నామినేషన్ దెబ్బ.. డేంజర్‌ జోన్‌లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్
సెల్ఫ్ నామినేషన్ దెబ్బ.. డేంజర్‌ జోన్‌లోకి స్ట్రాంగ్ కంటెస్టెంట్
16 పరుగులకే 5 వికెట్లు.. ద్వీవుల్లో డైనమేట్ బీభత్సం..
16 పరుగులకే 5 వికెట్లు.. ద్వీవుల్లో డైనమేట్ బీభత్సం..
రుద్రప్రయాగ్ లో చిక్కున్న దాదాపు 40 మంది తెలుగు భక్తులు..
రుద్రప్రయాగ్ లో చిక్కున్న దాదాపు 40 మంది తెలుగు భక్తులు..
ఉదయాన్నే ఈ పొరపాట్లు చేస్తే లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..
ఉదయాన్నే ఈ పొరపాట్లు చేస్తే లివర్ షెడ్డుకు వెళ్లినట్లే..