Lottery: పాపం లక్ష్మీ దేవి కటాక్షించినా.. విధి కరుణించడం లేదు.. రూ. 20 కోట్లు మిస్ అయ్యేనా..!

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Oct 05, 2021 | 2:09 PM

Lottery: ‘అదృష్టం ఒకసారే తలుపు తడుతుంది.. దురదృష్టం తలుపు తీసేదాకా తడుతుంది..’ అనే నానుడి తెలిసిందే. సాధారణంగా చాలా మంది తమను

Lottery: పాపం లక్ష్మీ దేవి కటాక్షించినా.. విధి కరుణించడం లేదు.. రూ. 20 కోట్లు మిస్ అయ్యేనా..!
Lottery

Follow us on

Lottery: ‘అదృష్టం ఒకసారే తలుపు తడుతుంది.. దురదృష్టం తలుపు తీసేదాకా తడుతుంది..’ అనే నానుడి తెలిసిందే. సాధారణంగా చాలా మంది తమను దురదృష్టం వెంటాడుతోందని వాపోతుంటారు. కానీ, కొన్నికొన్ని సార్లు అదృష్టం వరించినా వారు తెలుసుకోలేకపోతుంటారు. అది కూడా వారి దురదృష్టమే అని చెప్పాలి. ఇలాంటి పరిస్థితే దుబాయ్‌లోని భారతీయుడికి ఎదురైంది ఇప్పుడు. లక్ష్మీ దేవి కటాక్షించినా.. విధి మాత్రం అతన్ని కనికరించడం లేదు. ఫలితంగా అతను గెలుచుకున్న రూ. 20 కోట్లు అందుకోలేకపోతున్నాడు.

ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. కేరళకు చెందిన నహీల్ నిజాముద్దీన్ దుబాయ్‌లో సెటిల్ అయ్యాడు. ఇటీవల అతను ఓ లాటరీ కొనుగోలు చేశాడు. ఆ సమయంలో తన స్వస్థలమైన కేరళలోని చిరునామాను, రెండు ఫోన్ నెంబర్లను ఇచ్చాడు. అయితే, అతన్ని అదృష్టం వరించింది. బిగ్ టికెట్ అబూదాబి సిరీస్‌ 232 లాటరీ డ్రాలో అతను ఏకంగా 10 మిలియన్ దుబాయ్ దిర్హామ్‌లు గెలిచాడు. అంటే భారతీయ కరెన్సీల్లో రూ. 20 కోట్లు అన్నమాట. కానీ, ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. అతను ఇచ్చిన ఫోన్ నెంబర్లు పని చేయడం లేదు. దాంతో నిర్వాహకులు లాటరీ విషయాన్ని చెబుదామని కాల్ చేస్తే ఏ ఒక్క నెంబర్ కూడా కలవడం లేదు. దీంతో లాటరీ గెలుచుకున్న విషయం అతనికి తెలియకుండాపోయింది. అయితే, నహీల్ గెలుచుకున్న రూ. 20 కోట్ల అమౌంట్ అతనికి చేరే వరకు ప్రయత్నిస్తామని లాటరీ నిర్వాహకులు తెలిపారు. మరి లక్ష్మీ దేవి కటాక్షించింది.. విధి సహకరిస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి.

Also read:

Rashmi Gautam: రెడ్ డ్రెస్ లో రెడ్ హాట్ గా మెరిసిన ముద్ద మందారం.. అందాల రష్మీ లేటేస్ట్ ఫొటోస్..

High Cholesterol: తస్మాత్ జాగ్రత్త.. మీ కాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?.. అధిక కొలెస్ట్రాల్ ఉన్నట్లే..

Varshini Sounderajan: పాలరాతి పరువాలతో మతిపోగొడుతున్న భామ.. వర్షిణి లేటెస్ట్ ఫొటోస్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu