America: అగ్రరాజ్యంలో మరో అమానుషం.. సిక్యు క్యాబ్‌ డ్రైవర్‌పై దాడి.. తలపాగాను లాగి కింద పడేసి..

|

Jan 13, 2022 | 2:06 PM

అమెరికాలో మరో విద్వేష దాడి జరిగింది. జాన్‌ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భారత సంతతి సిక్కు ట్యాక్సీ డ్రైవర్‌పై గుర్తు తెలియని వ్యక్తి దాడికి తెగబడ్డాడు. సిక్కులు ఎంతో గౌరవంగా భావించే

America: అగ్రరాజ్యంలో మరో అమానుషం.. సిక్యు క్యాబ్‌ డ్రైవర్‌పై దాడి.. తలపాగాను లాగి కింద పడేసి..
Follow us on

అమెరికాలో మరో విద్వేష దాడి జరిగింది. జాన్‌ ఎఫ్ కెనడీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద భారత సంతతి సిక్కు ట్యాక్సీ డ్రైవర్‌పై గుర్తు తెలియని వ్యక్తి దాడికి తెగబడ్డాడు. సిక్కులు ఎంతో గౌరవంగా భావించే తలపాగాను లాగి కింద పడేశాడు. ఈ ఘటన ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ ఇటీవల నవజ్యోత్‌ పాల్‌ కౌర్‌ అనే మహిళ తన ట్విట్టర్‌ లో ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేసింది. దీంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఇందులో నిందితుడు బాధితుడిని పదే పదే కొట్టడం, అసభ్యపదజాలంతో దూషించడం, తలపాగాను లాగి కింద పడేశాడు. జేఎఫ్ కే అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఈ ఘటన జరిగిందని, అయితే ఈ వీడియోతో తనకు సంబంధం లేదని కౌర్‌ చెప్పుకొచ్చింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఈ వీడియో తీశాడని పేర్కొంది. అమెరికాలో ఇంకా ద్వేషపూరిత దాడులు జరగుతున్నాయని తెలియజేసేందుకే ఈ వీడియోను పోస్ట్ చేసినట్లు నవజ్యోత్‌ చెప్పుకొచ్చింది. అందులోనూ సిక్కు క్యాబ్‌ డ్రైవర్లపై పదే పదే దాడులు జరగడం తాను చూశానని ఆమె పేర్కొంది. బాధితుడి గోప్యతను కాపాడేందుకు అతని వివరాలు చెప్పడం లేదని ఆమె తెలియజేసింది.

కాగా ఈ వీడియోను చూసిన పంజాబీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అమెరికాలోని భారత కాన్సులేట్‌ కార్యాలయం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. దాడిని తీవ్రంగా పరిగణించి అమెరికా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే విచారణ చేపట్టి నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. దీనిపై స్పందించిన అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ దాడి తమను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంది. భిన్నత్వమే అమెరికాను మరింత బలంగా మారుస్తుందని, ఇలాంటి ద్వేషపూరిత దాడులను ఏ మాత్రం సహించలేమని చెప్పుకొచ్చింది. త్వరలోనే నిందితుడిని పట్టుకుని చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని భారత దౌత్యకార్యాలయానికి హామీ ఇచ్చింది. కాగా తలపాగా ధరించడం సిక్కుల సంప్రదాయమని, తమ గౌరవానికి సూచికని, ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని పంజాబీలు మండిపడుతున్నారు. అయితే బాధితుడి గోప్యత దృష్ట్యా ఈ వీడియోలను ఎవరూ ప్రసారం చేయద్దని వారు కోరుతున్నారు.

Also Read:

Coronavirus: అక్కడ టీకా తీసుకోని తండ్రులు పిల్లలతో గడిపే హక్కు కోల్పోతారు..

Coronavirus: కాంగ్రెస్‌లో కరోనా ప్రకంపనలు.. మల్లికార్జున ఖర్గే, వీరప్ప మొయిలీకి పాజిటివ్‌..

Akkineni Nagarjuna: సీఎం జగన్‌తో చిరంజీవి భేటీపై స్పందించిన నాగార్జున.. ఏమన్నారంటే..