AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ravi Chaudhary: భారత సంతతి వ్యక్తికి అమెరికా రక్షణ శాఖలో కీలక బాధ్యత.. అమెరికా సెనెట్ గ్రీన్ సిగ్నల్

Assistant Secretary of US Air Force: అమెరికా ప్రభుత్వంలో భారతీయులు ఒక్కొక్కరుగా పాగా వేస్తున్నారు. తాజాగా భారత సంతతికి చెందిన వ్యక్తి అత్యున్నత అమెరికా రక్షణ శాఖలో బాధ్యతలు దక్కాయి.

Ravi Chaudhary: భారత సంతతి వ్యక్తికి అమెరికా రక్షణ శాఖలో కీలక బాధ్యత.. అమెరికా సెనెట్ గ్రీన్ సిగ్నల్
Ravi Chaudhary
Balaraju Goud
|

Updated on: Mar 16, 2023 | 2:53 PM

Share

అమెరికా ప్రభుత్వంలో భారతీయులు ఒక్కొక్కరుగా పాగా వేస్తున్నారు. తాజాగా భారత సంతతికి చెందిన వ్యక్తి అత్యున్నత అమెరికా రక్షణ శాఖలో బాధ్యతలు దక్కాయి. యూఎస్ ఎయిర్‌ ఫోర్స్‌లో అసిస్టెంట్ సెక్రెటరీ ఆఫ్ డిఫెన్స్‌గా రవి చౌదరిని నియమితులు కానున్నారు. పెంటగాన్‌లోని అగ్ర పౌర నాయకులలో ఒకరిగా చేశారు. ఈ పదవిలో పనిచేసిన మొదటి భారతీయ అమెరికన్ ఆయనే. ఈ మేరకు అమెరికా పెద్దల సభ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రవి చౌదరి ఎంపికకు సంబంధించిన ప్రతిపాదనకు సెనెట్ 65 29 ఓట్ల తేడాతో మద్దతు పలికింది. రవికి అనుకూలంగా ఓటేసిన వారిలో డజును మందికి పైగా ప్రతిపక్ష రిపబ్లికన్ సభ్యులు ఉండటం గమనార్హం.

రవి చౌదరి 1993 2015 మధ్య అమెరికా ఎయిర్‌ఫోర్స్‌‌లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. అంచెలంచెలుగా ఎదుగుతూ.. సీ 17 విమాన పైలట్‌గా వివిధ రకాల మిషన్లలో పాల్గొన్నారు. ప్రస్తుతం విస్తృతంగా వినియోగంలో జీపీఎస్ ఏర్పాటులోనూ కీలకంగా వ్యవహరించారు. అమెరికా రవాణా శాఖలో సీనియర్ అధికారిగా కూడా రవి చౌదరి పనిచేశారు. అమెరికా విమానయాన శాఖ ఫెడరల్ ఏవియేషన్‌లోనూ సేవలందించారు. ఆ శాఖకు సంబంధించి అధునాతన పరిశోధన కార్యక్రమాలకు సంబంధించిన విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించారు.

ఆయన సేవలు గుర్తించి అమెరికా ప్రభుత్వం ఎయిర్ ఫోర్స్ అసిస్టెంట్ సెక్రెటరీ ఆఫ్ డిఫెన్స్‌గా ప్రతిపాదించింది. దీంతో అమెరికా పార్లమెంట్ సైతం ఆమోదం తెలిపింది. త్వరలో అధికారికంగా వైట్ హౌజ్ ఉత్తర్వులు జారీ చేయనుంది. ఆసియా అమెరికన్లు, పసిఫిక్ ద్వీపవాసులపై అధ్యక్షుడి సలహా కమిషన్‌లో పనిచేయడానికి అధ్యక్షుడు ఒబామా కూడా అతన్ని నియమించారు. తాజాగా వైమానిక దళం స్థిరత్వం, కార్యాచరణ సంసిద్ధతకు బాధ్యత వహిస్తారు రవి చౌదరి. ఇందులో ఇన్‌స్టాలేషన్‌లు, బేసింగ్ స్ట్రాటజీలను అభివృద్ధి చేయడం, అలాగే సైనిక గృహాల నాణ్యతను నిర్ధారించడం వంటివి బాధ్యతలు నిర్వహిస్తారు.

రవి చౌదరి నియామకం ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీకి ఒక ముఖ్యమైన మైలురాయి అని చెప్పొచ్చు. ఇది యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వంలో పెరుగుతున్న భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం, ప్రజా సేవకు వారి సహకారాన్ని గుర్తిస్తుందని చెప్పొచ్చు.