Dushahra: న్యూజెర్సీలో ఘనంగా దసరా ఉత్సవాలు.. ఆడిపాడిన ప్రవాసాంధ్రులు..
Dushahra in New Jersey: న్యూజెర్సీలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో న్యూయార్క్, న్యూజెర్సీ, డెలావేర్, పెన్సిల్వేనియా...

Dushahra
Dushahra in New Jersey: న్యూజెర్సీలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో న్యూయార్క్, న్యూజెర్సీ, డెలావేర్, పెన్సిల్వేనియా తదితర ప్రాంతాల్లో నివాసముంటున్న తెలుగువారితో సహా ప్రవాస భారతీయులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దుర్గా పూజతో ప్రారంభమైన ఉత్సవాలు సాంప్రదాయ బద్దంగా జరిగాయి. గర్భా నృత్య వేడుకల్లో మహిళలు, పురుషులు ఆడిపాడారు. అమ్మవారిని పూజించి తీర్ధ ప్రసాదాలను తీసుకున్నారు. పూజ అనంతరం జమ్మి ఆకులను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ ప్రవాసాంధ్రులు దసరా శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
Also Read: కేరళలో భారీ వర్షాలు ఏడు జిల్లాలకు రెడ్ అలెర్ట్.. పర్యాటక ప్రదేశాలకు వెళ్ల వద్దని సూచన..