Canada vs India: ‘ఇండియాకు వెళ్లిపోండి’.. కెనడాలోని ఇండియన్స్‌కు ఖలిస్తాన్ ఉగ్రవాదుల బెదిరింపు..
Canada vs India: కెనడాలో రోజురోజుకు భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. ఖలిస్తాన్ తీవ్రవాదులకు కెనడా అడ్డాగా మారడం భారత్‌లో ఆందోళన మరింత పెరుగుతోంది. కెనడాలో ఉన్న హిందువులు వెంటనే భారత్‌కు వెళ్లిపోవాలని, లేదంటే తీవ్ర పరిణమాలు ఉంటాయని ఖలిస్తాన్ సంస్థలు హెచ్చరించాయి. దీంతో భారత ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది
Canada vs India: కెనడాలో రోజురోజుకు భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. ఖలిస్తాన్ తీవ్రవాదులకు కెనడా అడ్డాగా మారడం భారత్‌లో ఆందోళన మరింత పెరుగుతోంది. కెనడాలో ఉన్న హిందువులు వెంటనే భారత్‌కు వెళ్లిపోవాలని, లేదంటే తీవ్ర పరిణమాలు ఉంటాయని ఖలిస్తాన్ సంస్థలు హెచ్చరించాయి. దీంతో భారత ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది
నిషేధిత ఖలిస్తాన్ అనుకూల సంస్థ సిక్కుస్ ఫర్ జస్టిస్ (SFJ) సంస్థ కెనడాలోని భారతీయ సంతతికి చెందిన హిందువులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. భారతదేశానికి మద్దతు ఇచ్చినందుకు, ఖలిస్తానీ నాయకుడు హర్‌దీప్ హత్యను సెలబ్రేట్ చేసుకున్నందుకు దేశం విడిచి వెళ్లాలని వార్నింగ్ ఇచ్చింది. భారత్‌లో ఉగ్రవాదిగా గుర్తించబడిన ఎస్‌ఎఫ్‌జే నాయకుడు గురుపత్వంత్ పన్నన్ ఇండియన్స్‌ను హెచ్చరిస్తూ ఒక వీడియో విడుదల చేశాడు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇండియన్ హిందువులు కెనడా వదిలి భారతదేశానికి వెళ్లిపోవాలని ఈ వీడియోలో సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ‘మీరు భారతదేశానికి మద్ధతు ఇవ్వడమే కాకుండా.. ఖలిస్థాన్ అనుకూల సిక్కులను అణిచివేసేందుకు కూడా మద్ధతు ఇస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కెనడా ప్రధాన మంత్రి జస్టిస్ ట్రూడో.. నిజ్జర్ హ్యతలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రేమయం ఉందంటూ చేసిన వ్యాఖ్యల తీవ్ర దుమారం రేపుతున్న క్రమంలో.. తాజాగా గురుపత్వంత్ సింగ్ పన్నన్ చేసిన కామెంట్స్ మరింత అలజడి సృష్టించాయి.
ఈ బెదిరింపులపై స్పందించిన కెనడియన్ హిందువుల ప్రతినిధి విజయ్ జైన్.. కీలక కామెంట్స్ చేశారు. పన్నన్ బెదిరింపులు చూస్తుంటే వారిలో హిందూ ఫోబియా పెరుగుతున్న ధోరణి కనిపిస్తోందన్నారు. ఖలిస్తాన్ సంస్థ మొత్తం హిందుఫోబియాతో అల్లాడిపోతోందన్నారు. జూన్, 1985లో వందలాది మంది ప్రాణాలను బలిగొన్న ఎయిర్ ఇండియా మాంట్రియల్-లండన్-ఢిల్లీ-బాంబే విమానంపై ఖలిస్తానీ బాంబు దాడి జ్ఞాపకాలను ప్రస్తావిస్తూ.. ట్రూడో వ్యాఖ్యలు పరిస్థితిని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉందని జైన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటన కెనడా చరిత్రలో బాధాకరమైన అధ్యాయంగా మిగిలిపోయిందన్నారు.
If a white supremacist had threatened saying all people of colour must leave Canada, imagine the uproar. Yet when a Khalistani threatens Hindus in Canada at an event in Canada, everyone bats their eyelid and looks the other way. https://t.co/iX610qOt34
— Rupa Subramanya (@rupasubramanya) September 19, 2023
పన్నన్ బెదిరింపులకు స్పందించిన ప్రముఖ వ్యాఖ్యాత సుబ్రమణ్య.. ‘హిందువులను వెళ్లిపోవాలని బెదిరించారు. మరి శ్వేతజాయుల ఆధిపత్యవాది కెనడాను విడిచి వెళ్లిపోవాలని బెదిరిస్తే? మీరేం చేస్తారు? ఆ తరువాత జరిగే పరిణామాలను ఒక్కసారి ఊహించుకోండి.’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు.
ఈ ఉద్రిక్తలు ఇలా ఉంటే.. కెనడా మంత్రి అనితా ఆనంద్.. శాంతి, ఐక్యత కోసం పిలుపునిచ్చారు. ‘మతంతో సంబంధం లేకుండా భారతదేశం నుంచి వచ్చే వారు, దక్షిణాసియా వాసులు, కుటుంబాలు ఐకమత్యంగా ఉండాలని సూచించారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మనమందరం ప్రశాంతంగా, ఐక్యంగా, సానుభూతితో ఉందాం.’ అని పిలుపునిచ్చారు అనితా ఆనంద్.
South Asians and families who come from India, regardless of religion, will share the sentiment that it was difficult to hear the Prime Minister’s statement yesterday. This is a time to let the legal process continue as it must. Let us all remain calm, unified, and empathetic. pic.twitter.com/vf4yKgXgN0
— Anita Anand (@AnitaAnandMP) September 19, 2023
అలర్ట్ జారీ చేసిన భారత ప్రభుత్వం..
భారత్-కెనడా మధ్య దౌత్యయుద్దం మరింత ముదిరింది. కెనడాలో ఉన్న భారతీయ విద్యార్ధులు, పౌరులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం అడ్వైజరీని జారీ చేసింది. భారతీయ పౌరులు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. కెనడాకు వెళ్లే భారతీయులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఖలిస్థానీ నేత హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత్ హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేయడంతో ఇరు దేశాల మధ్య విభేదాలు రాజుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ దేశంలో భారత రాయబారిపై కెనడా బహిష్కరణ వేటువేయగా, బదులుగా భారత్ ఆ దేశ రాయబారిని బహిష్కరించింది. ఈ పరిణామాల వేళ.. కెనడాలోని భారత పౌరులు, భారతీయ సంస్థలపై దాడులు జరిగే అవకాశాలున్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ అడ్వైజరీ జారీ చేసింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..