గృహ హింస (Domestic Violence) ను అరికట్టేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సమాజంలో మాత్రం మార్పు రావడం లేదు. చివరకు బాగా చదువుకున్నవారు కూడా మహిళలపై దారుణాలకు పాల్పడుతున్నారు. మరోవైపు ఆడవాళ్లకు అండగా ఉండాల్సిన పాలకులు, అధికారులు రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ఈక్రమంలో మలేషియాకు చెందిన ఓ మహిళా మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆమె పదవికే ఎసరు తెచ్చిపెట్టాయి. ఆమె వ్యాఖ్యలు గృహ హింసను ప్రోత్సహించేలా ఉన్నాయంటూ నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. మలేషియాకు చెందిన ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ మినిస్టర్ సిటి జైలా మొహమ్మద్ యూసోఫ్ ‘ మదర్స్ టిప్స్’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను విడుదల చేసింది. అందులో మొండిగా ఉండే భార్యలను కొట్టాలని మలేషియాకు చెందిన మహిళా డిప్యూటీ మంత్రి భర్తలకు సలహ ఒకటి ఇచ్చింది.
మంత్రి పదవికి రాజీనామా చేయండి..
‘మెండిగా వ్యవహరిస్తున్న భార్యలను క్రమశిక్షణలో పెట్టాలి. వారి ప్రవర్తనలో మార్పు రాకపోతే సున్నితంగా కొట్టండి. అప్పటికీతీరు మార్చుకోకపోతే వారికి దూరంగా ఉండడం ఉత్తమం. అంతేకాదు మహిళలు తమ భర్తతో మాట్లాడాలంటే ముందుగా అనుమతి తీసుకోవాలి’ అని భర్తలకు సలహాలు, సూచనలు ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. కాగా బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని నెటిజన్లు మొహమ్మద్ యూసోఫ్ పై మండిపడుతున్నారు. ‘ ఈ ప్రపంచంలోఎవరికీ మరొకరిని కొట్టే హక్కు లేదు, మీరు డిప్యూటీ మంత్రిగా కొనసాగేందుకు అర్హత లేదు. వెంటనే రాజీనామా చేయండి’ అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా మంత్రి వ్యాఖ్యలు కాస్తా జాయింట్ యాక్షన్ గ్రూప్ ఫర్ జెండర్ ఈక్వాలిటీ, మహిళా హక్కుల సంఘాలకు చేరింది. దీంతోవారు కూడా మహిళా మంత్రిపై ఆక్రోషం వెళ్లగక్కుతున్నారు. ఆమె తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
Also Read:Naga Chaitanya: అక్కినేని అందగాడితో మళ్లీ జత కట్టనున్న లైలా!.. దర్శకుడు ఎవరంటే..
Indian Navy: విశాఖ తీరంలో ఒళ్ళు గగుర్పొడిచే భారత నావికాదళ సాహస విన్యాసాలు..
Vijayawada: బెజవాడ నడిబొడ్డున ట్రాఫిక్ కష్టాలకు చెక్.. బెంజ్ సర్కిల్ సెకండ్ ఫ్లై ఓవర్ ప్రారంభం..