అఫీసుకి వెళ్లడం, తిరిగి రావడం ఎంత సవాలుతో కూడుకున్న పని అని ఉద్యోగం చేస్తున్న ప్రతి ఒక్కరికీ అనుభవమే. ఒక్కోసారి బస్సులో గంటలు గంటలు ప్రయాణించాల్సి ఉంటుంది. మరి కొన్నిసార్లు మెట్రోలోనే నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తుంది. వ్యక్తిగత వాహనాలు ఉన్నవారికి ఇలాంటి అనుభవాల నుంచి కొంచెం మినహాయింపు ఉంటుంది. తమ సొంత వాహనాల్లో హాయిగా ఆఫీసుకు వెళ్లి తిరిగి వస్తారు. అయితే ఆటోలోనో, బస్సులోనో, మెట్రోలోనో ప్రయాణించే వారు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ ఆఫీసుకు వెళ్ళాలి కనుక ప్రయాణం చేస్తారు. అయితే ప్రస్తుతం ఒక వ్యక్తి బస్సులోనో, మెట్రోలోనో కాకుండా ఏకంగా ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ ఆఫీసుకు వెళ్లి వస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. అవును, ఇది పూర్తిగా నిజం.
ఈ వ్యక్తి పేరు సెబ్. అతను జర్మనీ నివాసి. అయితే బ్రిటన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అతను టిక్ టాకర్. మిర్రర్ నివేదిక ప్రకారం సెబ్ ప్రతిరోజూ జర్మనీలోని హాంబర్గ్ నుంఛి లండన్‌లోని కానరీ వార్ఫ్‌కు వెళ్లి టిక్‌టాక్‌లో షేర్ చేస్తాడు. ఇలా ప్రయాణించడానికి అతనికి ఐదు గంటల సమయం పడుతుంది. అతను ఇలా ఎందుకు చేస్తాడు? అంటే అతను ప్రతిరోజూ విమానంలో హాంబర్గ్ నుంచి లండన్‌కు ఎందుకు వెళ్తాడు అని ఎవరైనా అతనిని అడిగినప్పుడు.. అతను చెప్పిన సమాధానం విని ఎవరైనా ఆశ్చర్యపోతారు.
లండన్‌లో నివసించడం అంటే చాలా ఖర్చుతో కూడినది. ఆపిల్ కి సంబంధించిన కార్యాలయం లండన్‌లోనే ఉన్నప్పటికీ.. డబ్బు ఆదా చేయడానికి తాను ప్రతిరోజూ ఫ్లైట్‌లో ఆఫీసుకు వెళ్లి వస్తానని చెప్పాడు. ఇలా చేయడానికి ముఖ్య కారణం హాంబర్గ్‌లో నివసించే తన గర్ల్ ఫ్రెండ్ కారణం అని అతను చెప్పాడు. టిక్‌టాక్‌లో పంచుకున్న అతని వీడియోలలో సెబ్ సాయంత్రం 5 గంటలకు కానరీ వార్ఫ్‌లోని తన ఆఫీసు నుండి బయలుదేరి.. కొన్ని గంటలు ప్రయాణించి హీత్రూ విమానాశ్రయానికి ఎలా చేరుకున్నాడో చెప్పాడు. అప్పుడు ఫ్లైట్ బయలుదేరడానికి ఒక గంట ముందు కొంచెం ఆహారం తీసుకుని, ఆపై అతను ఫ్లైట్ ఎక్కాడు.
ఫ్లైట్‌ను పట్టుకునే ముందు మొత్తం నాలుగు రైళ్లలో ప్రయాణించి, ఆపై విమానంలో ప్రయాణించాల్సి ఉంటుందని సెబ్ వివరించాడు. నెలలో నాలుగు రోజులు లండన్‌లో ఉండాల్సి ఉంటుందని కూడా చెబుతున్నాడు. అంతేకాదు ఆఫీసుకు వెళ్లేందుకు రోజూ జర్మనీ, బ్రిటన్‌ల మధ్య తిరుగుతుంటాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..