G20 FMCBG Meeting: భారత్-ఇండోనేషియా మధ్య ఆర్థికపరమైన సంబంధాలపై ఇరుదేశాల ఆర్థిక మంత్రులు దృష్టిసారించారు. ఈ మేరకు ‘ఇండియా – ఇండోనేషియా ఎకనామిక్ అండ్ ఫైనాన్షియల్ డైలాగ్(EFD Dialogue)’ని ప్రారంభించారు. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలను బలపరిచేందుకు భారత ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, ఇండోనేషియా ఆర్థిక మంత్రి శ్రీ ముల్యాణి ఇంద్రావతి తీసుకున్న ఈ ఆడుగులకు ఆదివారం జరిగిన జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల(FMCBG) 3వ సమాావేశం వేదికగా మారింది. ఈ ప్రయత్నం భారత్, ఆగ్నేయాసియా మధ్య సహకారాలను సులభతరం చేయడంతో పాటు ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి దోహదం చేస్తుంది. ఇక ఈ సమావేశం నిర్మలా సీతారామన్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలో జరిగింది.
ఈ సందర్భంగా సీతారామన్ మాట్లాడుతూ.. ‘‘1991 నాటి ‘లుక్ ఈస్ట్ పాలసీ’, దాని తర్వాత వచ్చిన ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ కారణంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో మెరుగైన వృద్ధిని సాధించాం. ప్రధానంగా వ్యాపార, సాంస్కృతిక రంగాల్లో ఈ సంబంధాలు మెరుగుపడ్డాయి’’ అని అన్నారు.
Tune in! ▶️
G20 Infrastructure Investors Dialogue – Leveraging Funding and Financing Mechanisms and Approaches for the Cities of Tomorrow, an event organised on the sidelines of the 3rd #FMCBG Meet will begin shortly. #G20India
Click here to watch: https://t.co/9Np0qPwl30
— G20 India (@g20org) July 16, 2023
ఇంకా ‘‘ASEAN ప్రాంతంలో భారత్‌కి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఇండోనేషియా అవతరించింది. 2005 వాటితో పోల్చుకుంటే మా మధ్య వాణిజ్యం8 రెట్లు పెరిగింది, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇది 38 బిలియన్ల డాలర్లకు చేరుకుంది’’ అని సీతారామన్ అన్నారు.
👉 India and Indonesia announce launch of the “India – Indonesia Economic and Financial Dialogue” #EFDDialogue on sidelines of G20 Finance Ministers and Central Bank Governors #G20FMCBG meeting in Gujarat
⁰👉 #EFDDialogue to strengthen cooperation between the two nations and… pic.twitter.com/JYXygz467a— Ministry of Finance (@FinMinIndia) July 16, 2023
అలాగే EFD Dialogueని ప్రారంభించిన సందర్భంగా ఇండోనేషియా ఆర్థిక మంత్రిశ్రీ ముల్యాని ఇంద్రావతి మాట్లాడుతూ శ్రీ ముల్యాని ఇంద్రావతి మాట్లాడుతూ.. ‘2 దేశాలకు వాణిజ్య రంగంలో చాలా అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ రెండు దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యాపార అభివృద్ధిలోని సమస్యను పరిష్కరించడంలో సహకరిస్తుంది. ముఖ్యంగా దీని ద్వారా వాతావరణ మార్పు, ప్రపంచ ప్రజల ఆరోగ్యం, ఇరు దేశాల మధ్య పెట్టుబడుల సహకారాన్ని బలోపేతం చేయవచ్చ’ని అన్నారు.
On the sidelines of the 3rd #G20 Finance Ministers and Central Bank Governors #FMCBG meeting under #G20India Presidency, a seminar was organised on ‘Achieving Growth-Friendly Climate Action and Financing for Emerging and Developing Economies’. Todays’ engaging discussion focused… pic.twitter.com/S6HoPzmSR9
— Ministry of Finance (@FinMinIndia) July 16, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..