ఫ్రాన్స్‌లో దారుణం చోటుచేసుకుంది. ఫ్రాన్స్-స్పెయిన్ సరిహద్దులో ఉన్న సెయింట్ జీన్-డీ-లజ్‌లోని సెయింట్ థామస్ డి-అక్విన్ హైస్కూల్‌లో ఒక విద్యార్థి టీచర్‌ను కత్తితో పొడిచి చంపాడు. 53 ఏళ్ల స్పానిష్ టీచర్ స్పానిష్ క్లాస్ తీసుకుంటుండగా ఉదయం 10 గంటల సమయంలో హఠాత్తుగా క్లాసులోకి చొరబడిన 16 ఏళ్ల ఒక విద్యార్థి కత్తితో ఆమెపై దాడిచేశాడు. ఛాతీపై కత్తితో పొడవడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. క్లాస్‌రూమ్‌లోకి ప్రవేశించిన ఈ విద్యార్థి గదిలోపలి నుంచి తాళం వేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటన జరగగానే క్లాసులోని విద్యార్థులంతా భయంతో పారిపోయారు.
ఈ దాడిని పాల్పడిన విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. తనను ఏదో శక్తి అవహించిందని, టీచర్‌పై దాడి చేయమని తనకు ఆదేశాలు వినిపించాయని ఆ విద్యార్థి పోలీసులతో చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విద్యార్థికి మానసిక సమస్యలు ఉన్నాయని అక్కడి పత్రికల్లో వార్తలు వచ్చాయి.
ఈ ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు, స్కూల్‌కు తాత్కాలికంగా సెలవులు ప్రకటించారు. ఈ దాడిని ఫ్రాన్స్ ప్రభుత్వం ఖండించింది. ఇది దేశంపై జరిగిన దాడిగా ఫ్రాన్స్ విద్యాశాఖ మంత్రి పాప్ డియాయే ట్వీట్ చేశారు.
అక్టోబర్ 2020లోనూ ఫ్రాన్స్‌లో ఈ తరహా దాడి జరిగింది. ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..