పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను పాక్ రేంజర్లు అరెస్ట్ చేశారు. అవినీతి ఆరోపణలపై ఇమ్రాన్ ఖాన్ ను మంగళవారం అరెస్ట్ చేశారు. ఇస్లామాబాద్ హైకోర్టులో హాజరుపర్చిన తరువాత ఇమ్రాన్‌ను రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసేందుకు గతంలో చాలాసార్లు ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆయన్ను అరెస్టు చేయడం సాధ్యం కాలేదు. పెద్ద ఎత్తున ఆందోళనలు జరగడం, దీంతోపాటు కోర్టులో ఆయనకు ఉపశమనం లభించడంతో ఇంతకాలం ఆయన్ను అరెస్టు చేయలేదు.
ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్ట్ చేస్తున్న సమయంలో కోర్టు దగ్గర గొడవలు చెలరేగాయి. ఇమ్రాన్ లాయర్‌కు ఈ గొడవలో తీవ్రగాయాలయ్యాయి. అనంతరం భారీ భధ్రతా సిబ్బంది మధ్య ఇమ్రాన్ ను రహస్య ప్రాంతానికి తరలిస్తున్నట్లు అక్కడి మీడియా కథనాలు ప్రచురించింది.
అయితే, తన హత్య కుట్రకు జరుగుతోందని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఇమ్రాన్ అరెస్ట్‌ను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ.. ఇమ్రాన్ అరెస్ట్ తరువాత ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్ విధించారు.
హైడ్రామా మధ్య ఇమ్రాన్‌ను అరెస్ట్ చేశారు పాక్ రేంజర్లు. ఇమ్రాన్‌ఖాన్ కోర్టులో ఉన్న సమయం లోనే లోపలికి దూసుకొచ్చారు పాక్ రేంజర్లు. అల్‌ఖదీర్ ట్రస్ట్ నిధుల దుర్వినియోగం కేసులో ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు.
Former Pakistan PM & PTI chief Imran Khan has been arrested from outside the Islamabad High Court (IHC) by Rangers, reports Pakistan’s Dawn News pic.twitter.com/FHFTw3wUbr
— ANI (@ANI) May 9, 2023
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..