China Bomb Blast: చైనాలోని షెన్యాంగ్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. బస్సులో పేలుడు సంభవించిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. 42 మంది తీవ్రంగా గాపపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రుల్లో చేర్పించారు. దీనికి సంబంధించి చైనా అధికారులు ప్రకటన విడుదల చేశారు. పేలుడు ఘటన తరువాత అలర్ట్ అయిన చైనా పోలీసు దళాలు.. ఘటనా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పేలుడుకు గల కారణాలపై విశ్లేషిస్తున్నారు. కాగా, భారీ పేలుడుతో షెన్యాంగ్ నగరం ఉలిక్కిపడింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా.. మిగతా వారు స్థిమితంగా ఉన్నారని చైనా అధికారులు ప్రకటించారు.
Also read:
Knowledge Video: దేశంలో ఎన్ని కోట్ల మొబైళ్లు తయారయ్యాయో తెలుసా..? షాకింగ్ విషయాలు వెల్లడి..
Dog Viral Video: ఈ కుక్క వేసే యోగాసనాలు చూస్తే షాకవ్వాల్సిందే..! వైరల్ అవుతున్న సూపర్ వీడియో..