AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక నుంచి జపాన్‌కు నయా చక్రవర్తి

టోక్యో : జపాన్‌ నూతన చక్రవర్తి నరూహితో సింహాసనాన్ని అధిష్ఠించారు . ఈ మేరకు వారసత్వంగా సంక్రమించే ఖడ్గం, నగలు, రాజముద్రలను అందుకున్నారు. పట్టాభిషేక మహోత్సవం అతి కొద్దిమంది ప్రముఖుల మధ్య జరిగింది. ఆ తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి జపాన్ 126వ చక్రవర్తి హోదాలో‌ నరూహితో తొలిసారి ప్రసంగించారు. కొత్త రాజు శకానికి శుభప్రదమైన కాలంగా నామకరణం చేశారు. అక్టోబర్‌ 22న ప్రజల మధ్య కొత్త చక్రవర్తి పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రపంచ […]

ఇక నుంచి జపాన్‌కు నయా చక్రవర్తి
Ram Naramaneni
|

Updated on: May 01, 2019 | 3:21 PM

Share

టోక్యో : జపాన్‌ నూతన చక్రవర్తి నరూహితో సింహాసనాన్ని అధిష్ఠించారు . ఈ మేరకు వారసత్వంగా సంక్రమించే ఖడ్గం, నగలు, రాజముద్రలను అందుకున్నారు. పట్టాభిషేక మహోత్సవం అతి కొద్దిమంది ప్రముఖుల మధ్య జరిగింది. ఆ తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి జపాన్ 126వ చక్రవర్తి హోదాలో‌ నరూహితో తొలిసారి ప్రసంగించారు. కొత్త రాజు శకానికి శుభప్రదమైన కాలంగా నామకరణం చేశారు. అక్టోబర్‌ 22న ప్రజల మధ్య కొత్త చక్రవర్తి పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాధినేతలు హాజరై జపాన్‌ కొత్త చక్రవర్తి నరూహితోకు శుభాకాంక్షలు తెలపనున్నారు. 85 ఏళ్ల అకిహితో జపాన్‌ చక్రవర్తిగా వైదొలగడంతో ఆయన కుమారుడు నరూహితో ఈ రోజు సింహాసనాన్ని అధిష్ఠించారు.