
ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన టెస్లా సీఈవో ఎలన్ మస్క్.. రూటే వేరు.. ఆయన చేసే పనులు, ప్రకటనలు.. ఎప్పుడూ చర్చనీయాంశమవుతాయి. సోషల్ మీడియా మైక్రోబ్లాగింగ్ సైట్.. ట్విట్టర్‌ను కొనేందుకు సిద్ధపడ్డ ఎలన్ మస్క్.. తరువాత వెనక్కి తగ్గారు. అయితే మళ్లీ కొనేందుకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో.. శాన్ ఫ్రాన్సిస్‌కోలో ఉన్న ట్విట్టర్ కార్యాలయాన్ని ఎలన్ మస్క్ విజిట్ చేశారు. అయితే ఆ ఆఫీసుకు వెళ్తున్న సమయంలో ఆయన తన చేతులో ఓ సింక్ పట్టుకుని వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దానికి సంబంధించిన వీడియోను ఎలన్ మస్క్ కూడా షేర్ చేశారు. ట్విట్టర్ హెడ్‌క్వార్టర్స్‌లోకి ఎంటర్ అవుతున్నానని, ఇక అది సింక్ కావాల్సిందే అంటూ మస్క్.. ట్విట్టర్లో షేర్ చేసిన వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. అయితే.. ట్విట్టర్ సోషల్ నెట్‌వర్క్ సైట్‌ను 44 బిలియన్ల డాలర్లకు ఎలన్ మస్క్ కొనుగోలు చేయనున్నారు. అయితే ఆ డీల్ కుదుర్చుకునే కొన్ని రోజుల ముందు ఎలన్ మస్క్ అలా ఆఫీసుకు వెళ్లడం నెట్టింట వైరల్ అయింది.
అయితే.. కొన్ని నెలల ముందు ట్విట్టర్‌ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించిన ఎలన్ మస్క్ .. ఆ తర్వాత డీల్‌కు బ్రేక్ వేస్తున్నట్లు చెప్పారు. దీంతో ట్విట్టర్, ఎలన్ మస్క్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఫేక్ అకౌంట్లు చూపుతూ ట్విట్టర్ మోసాలకు పాల్పడుతున్నట్లు ఎలన్ మస్క్ ఆరోపిణలు సైతం చేశారు. దీనికి జవాబిచ్చిన ట్విట్టర్.. డీల్ నుంచి బయటపడేందుకు మస్క్ ఆరోపణలు చేసినట్లు ట్విట్టర్ వెల్లడించింది. దీనిపై కేసు కూడా నడుతస్తోంది. సోషల్ మీడియా నెట్‌వర్క్ కోసం తన $44-బిలియన్ బిడ్‌ను పూర్తి చేయడానికి కోర్టు అక్టోబర్ 28 గడువుగా నిర్ణయించింది. ఈ క్రమంలో ఇటీవలనే మస్క్ ట్విట్టర్ను కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. ముందుగా కుదుర్చుకున్న డీల్‌కే కొనుగోలు చేయనున్నట్లు మస్క్ తెలిపారు. ఈ క్రమంలో బుధవారం మస్క్ ట్విట్టర్ కార్యాలయాన్ని సందర్శించారు. ట్విట్టర్ కొనుగోలు డీల్ ఒప్పందం రేపు జరగనింది. ఒకవేళ రేపటి లోగా ట్విట్టర్, మస్క్ మధ్య ఒప్పందం కుదరకుంటే.. ఈ కేసులో మళ్లీ విచారణ ప్రారంభంకానుంది.
Entering Twitter HQ – let that sink in! pic.twitter.com/D68z4K2wq7
— Elon Musk (@elonmusk) October 26, 2022
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన ఎలన్ మస్క్.. సింక్‌ని ట్విట్టర్ ప్రధాన కార్యాలయంలోకి ఎందుకు తీసుకెళ్లాడని ఆశ్చర్యపోతున్నారు. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. జోక్.. కోసమే మస్క్ అలా చేశారంటూ పేర్కొంటున్నారు.