Eileen Wang: మేయర్ ముసుగులో చైనా ఏజెంట్.. ఎఫ్‌బీఐ ఎలా పట్టుకుందంటే?
కాలిఫోర్నియాలోని అర్కాడియా నగర మేయర్ ఐలీన్ వాంగ్ సంచన నిర్ణయం తీసుకున్నారు. ఆమె తన మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. నగర మేయర్‌గా ఉంటూ చైనా ప్రభుత్వానికి అక్రమ ఏజెంట్‌గా వ్యవహరించినట్లు అమెరికా ఇన్వెస్టిగేషన్ సంస్థ అయిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) ఆమెపై సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఈ అభియోగాలను అంగీకరిస్తూ ఆమె తన పదవికి రాజీనామా చేశారు.

కాలిఫోర్నియాలోని అర్కాడియా నగర మేయర్ ఐలీన్ వాంగ్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంచలన ఆరోపణలు చేసింది. ఆమెకు చైనాకు అక్రమ ఏజెంట్‌గా పనిచేసినట్టు ఆరోపణలు మోపింది. ఫెడరల్ ప్రాసిక్యూటర్ల కథనం ప్రకారం.. వాంగ్ తన మాజీ ఫియాన్సీ యానింగ్ ‘మైక్’ సన్‌తో కలిసి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రయోజనాల కోసం అమెరికాలో పనిచేసినట్టు ఎఫ్‌బీఐ పేర్కొంది. వీరిద్దరూ కలిసి ‘యుఎస్ న్యూస్ సెంటర్’ అనే వెబ్‌సైట్‌ను నడిపారని… ఇది స్థానిక చైనీస్ అమెరికన్లకు వార్తలను అందించే వేదికగా నటిస్తూనే, తెరవెనుక చైనాకు అనుకూలంగా అనేక కథనాలు ప్రచారం చేసినట్టు తేలింది. 2020-2022 మధ్య ఈ వెబ్‌సైట్ పీఆర్‌సీకి ఫేవర్‌గా ప్రచారం చేయడంతో పాటు దాని ప్రయోజనాల కోసం పని చేసినట్లు నిఘా సంస్థ గుర్తించింది.
అయితే తాజాగా తనపై వచ్చిన ఆరోపణలు ఆమె అంగీకరించింది. చైనా ప్రభుత్వ ఆదేశాలతో వెబ్‌సైట్ నటినట్టు ఆమె ఒప్పుకుంది. ఇక ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ఆమె భాగస్వామి మైక్ సన్‌కు ఇప్పటికే గత అక్టోబర్‌లో నాలుగేళ్ల జైలు శిక్ష ఖరారైంది. ఇప్పుడు తాజాగా ఈమె వ్యవహారం కూడా బయటపడడంతో ఆమెకు గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
కాగా నవంబర్ 2022లో అర్కాడియా సిటీ కౌన్సిల్‌కు ఎన్నికైన ఐలీన్ వాంగ్, రొటేషన్ పద్ధతిలో మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే, తాజాగా బయటపడిన ఈ విదేశీ ఏజెంట్ కుంభకోణం స్థానిక రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. త్వరలోనే ఆమె లాస్ ఏంజిల్స్‌లోని ఫెడరల్ కోర్టులో హాజరుపర్చనున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
