Golden Tongues: 2 వేల ఏళ్లనాటి సమాధుల్లో… బంగారపు నాలుక.. అప్పట్లోనే అవయవాల రీప్లేస్మెంట్..

Golden Tongues: ఈజిప్టులో పురావస్తు శాస్త్రవేత్తలు తరచూ తవ్వకాలు జరుపుతూ ఉంటారు. ఈ తవ్వకాల్లో ఎప్పుడూ ఏదో విశేషాన్ని గుర్తిస్తారు. తాజాగా ఈ జిప్టులోని కొన్ని సమాధులపై పురావస్తు..

Golden Tongues: 2 వేల ఏళ్లనాటి సమాధుల్లో... బంగారపు నాలుక.. అప్పట్లోనే అవయవాల రీప్లేస్మెంట్..
Golden Tongues
Follow us
Surya Kala

|

Updated on: Dec 06, 2021 | 8:24 PM

Golden Tongues: ఈజిప్టులో పురావస్తు శాస్త్రవేత్తలు తరచూ తవ్వకాలు జరుపుతూ ఉంటారు. ఈ తవ్వకాల్లో ఎప్పుడూ ఏదో విశేషాన్ని గుర్తిస్తారు. తాజాగా ఈ జిప్టులోని కొన్ని సమాధులపై పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో ఒక రాజవంశానికి చెందిన రెండు సమాధులు వెలుగులోకి వచ్చాయి.  వీటిల్లో బంగారపు అవశేషాలు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా శాస్త్రవేత్తలను బంగారు నాలుక ఆకర్షించింది.

ఈజిప్టులోని మిన్యా గవర్నరేట్‌లో రెండు వేల ఏళ్ల క్రితం నాటి సైటే రాజవంశానికి చెందిన రెండు సమాధులు పక్కపక్కనే ఉన్నట్లు గుర్తించామని కైరోలోని పురావస్తుశాఖ ప్రకటించింది. స్పానిష్ పురావస్తు మిషన్ ద్వారా ఈ సమాధులను కనుగొన్నట్లు తెలిపింది. ఈ సమాధులలో ఒకదానిలో బంగారు నాలుకలతో ఉన్న ఇద్దరు అపరిచిత వ్యక్తుల అవశేషాలను కనుగొన్నట్లు సుప్రీమ్ కౌన్సిల్ ఆఫ్ యాంటిక్విటీస్ సెక్రటరీ జనరల్ మోస్తఫా వాజిరి వెల్లడించారు.

ఇంకా సమాధి లోపల ఒక మహిళ ఆకారంలో ఉన్న సున్నపురాయి శవపేటికను కనుగొన్నట్లు చెప్పారు. కాగా ఈ సమాధి పురాతన కాలంలో తెరవబడిందని ప్రాథమిక అధ్యయనాల్లో తేలినట్లు వాజీరి పేర్కొన్నారు. ఇక రెండోవ సమాధి మాత్రం ఇప్పుడే మొదటిసారి తెరిచినట్లు చెప్పుకొచ్చారు. కాగా కానోపిక్ కుండలను కలిగి ఉన్న రెండు శవపేటికలతో పాటు, సున్నపురాయి శవపేటిక కూడా ఇప్పటివరకు ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నట్లు తెలిపారు. ఒక కుండలో ఫైయన్స్‌తో చేసిన సుమారు 402 ఉషబ్తి బొమ్మలు, చిన్న తాయెత్తులు, ఆకుపచ్చ పూసలు ఉన్నాయని చెప్పారు.

Also Read:  కరోనాతో మరణించిన జర్నలిస్టులకు 2 లక్షలు.. ఐదేళ్లపాటు నెలకు రూ.3 వేలు పింఛన్‌.. ఈ నెల 15న చెక్కుల పంపిణీ

'డాకు మహారాజ్'లో నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్
'డాకు మహారాజ్'లో నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా లేడీ కోహ్లీ
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా లేడీ కోహ్లీ
కళ్లు ఉబ్బిపోయి ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో రిలీఫ్ పొందండి!
కళ్లు ఉబ్బిపోయి ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో రిలీఫ్ పొందండి!
కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు అలర్ట్.. దేహదారుఢ్య పరీక్షలు వాయిదా!
కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు అలర్ట్.. దేహదారుఢ్య పరీక్షలు వాయిదా!
వైరస్‌తో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.10 లక్షల కోట్లు నష్టం
వైరస్‌తో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.10 లక్షల కోట్లు నష్టం
అనిల్ తర్వాతి సినిమా ఆయనతోనే.. డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
అనిల్ తర్వాతి సినిమా ఆయనతోనే.. డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి బుమ్రా ఔట్.. కారణం అదేనంట..
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి బుమ్రా ఔట్.. కారణం అదేనంట..
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
ఉండిలో రతన్‌ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి లోకేశ్
కాలంతో పనిలేదు నేస్తం.. కీరా దోసతో.. కోరినంత ఆరోగ్యం!
కాలంతో పనిలేదు నేస్తం.. కీరా దోసతో.. కోరినంత ఆరోగ్యం!
అభిమానుల మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన రామ్ చరణ్..
అభిమానుల మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన రామ్ చరణ్..