Major Occupation: ఆ దేశంలో జీవనోపాధి కోసం కొత్త మార్గం.. ప్రధాన వృత్తిగా బంగారం అన్వేషణ.. రోజుకో గ్రాము సంపాదన

Major Occupation: థాయ్‌లాండ్‌ ప్రజలు బంగారం అన్వేషణలో మునిగిపోయారు. దక్షిణ ప్రావిన్స్‌లో మలేసియా సరిహద్దులోని సుఖిరిన్‌ ప్రాంతాన్ని గోల్డ్‌ మౌంటెన్‌ గా..

Major Occupation: ఆ దేశంలో జీవనోపాధి కోసం కొత్త మార్గం.. ప్రధాన వృత్తిగా బంగారం అన్వేషణ.. రోజుకో గ్రాము సంపాదన
Thailand Gold Hub
Follow us

|

Updated on: Dec 06, 2021 | 8:42 PM

Major Occupation: థాయ్‌లాండ్‌ ప్రజలు బంగారం అన్వేషణలో మునిగిపోయారు. దక్షిణ ప్రావిన్స్‌లో మలేసియా సరిహద్దులోని సుఖిరిన్‌ ప్రాంతాన్ని గోల్డ్‌ మౌంటెన్‌ గా పిలుస్తారు. ఇక్కడి సై బురి నది పరీవాహక ప్రాంతం అపార బంగారు నిక్షేపాలతో మెరిసిపోతోంది. దాంతో స్థానికులు ఇప్పడు గోల్డ్‌ ప్యానర్స్‌గా మారిపోతున్నారు. ముఖ్యంగా మహిళలు. నిత్యం విదేశీ పర్యాటకుల సేవలో తరించే స్థానిక ప్రజలు.. ఉపాధి కరువై నదులు, కాలువలు, చెలమల్లో నీటిలోని అవక్షేపాలను వడపోస్తూ కనిపిస్తున్నారు. తమ పూర్వీకుల బాటలో సాంప్రదాయ పద్ధతుల్లో బంగారు అన్వేషణను ఆదాయ వనరుగా మలుచుకుంటున్నారు. విదేశీ పర్యాటకులతో ఎప్పుడూ రద్దీగా కయకింగ్‌ చేసే నదుల్లో ఇప్పుడు బంగారాన్ని వెతుకుతున్నారు.

ఒక కుటుంబం మొత్తం కలిసి రోజంతా వెతికితే ఒక గ్రాము బంగారం దొరుకుతుంది. ఈ గ్రాము బంగారాన్ని 1,500 బాత్‌లకు అంటే ఇండియన్‌ కరెన్సీలో 3,345 రూపాయలకు స్థానిక వ్యాపారులకు అమ్ముతారు. ఇలా సేకరించిన బంగారాన్ని బ్యాంకాక్‌లో ఆభరణాల తయారీకి వినియోగిస్తారు. కాగా థాయిలోని 31 ప్రావిన్స్‌ల్లో 76 చోట్ల 700 టన్నుల బంగారు నిక్షేపాలను కనుగొన్నారు. వీటి విలువ 900 బిలియన్ల నుంచి ఒక ట్రిలియన్‌ బాత్‌ ఉంటుంది. థాయిలాండ్‌ అంతటా ప్రవహించే అనేక నదులు, ప్రవాహాల్లో బంగారు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. బ్యాంగ్‌ సఫాన్‌ జిల్లాలో మే నుంచి డిసెంబర్ వరకు, సుఖిరన్‌లో డిసెంబర్‌ నుంచి మార్చి వరకు ఈ బంగారం అన్వేషణ ఎక్కువగా జరుగుతుంది.

ఇప్పటికీ థాయిలాండ్‌లోని అనేక ప్రాంతాల నుంచి ప్రజలు బంగారం కోసం వాంగ్‌ నదికి తరలివస్తుంటారు. ఇక్కడి బంగారు అన్వేషణకు ప్రభుత్వం కూడా నిర్ణీత రుసుముతో అనుమతులిస్తోంది. అపార నిధులను వెలికి తీయడానికి భారీ వృక్ష సంపద అడ్డురావడంతో అక్కడి ప్రభుత్వం సాంప్రదాయ పద్ధతుల వైపే మొగ్గు చూపుతోంది. ఇక ఈ బంగారు అన్వేషణలో భాగంగా నదుల అడుగు భాగం నుంచి ఇసుకతో కూడిన ఒండ్రు పదార్థాలను పైకి తీస్తారు. వాటిని ఒక గమేళ వంటి పాత్రలో వేసి రాళ్లు, ఇసుకను వేరు చేస్తారు. మిగిలిన దానిని పాత్రతో నీటిపై స్విర్లింగ్‌ మోషన్‌లో కడుగుతారు. ఈ క్రమంలో తేలికైన పదార్థం పాన్‌ పైభాగానికి తేలుతుంది. బరువైన బంగారు రేణువులు దిగువకు మునిగిపోతాయి. వాటిని గోల్డ్‌ డస్ట్‌ అంటారు. కొందరైతే నీటి అడుగు భాగంలొ డైవింగ్‌ చేస్తూ భారీగానే బంగారాన్ని సేకరిస్తారు.

Also Read:  2 వేల ఏళ్లనాటి సమాధుల్లో… బంగారపు నాలుక.. అప్పట్లోనే అవయవాల రీప్లేస్మెంట్..