Margasira Masam: ఆర్ధిక కష్టాలతో ఇబ్బంది పడుతున్నారా.. మార్గశిరంలో గురువారం లక్ష్మీదేవిని ఇలా పూజించండి..

Margasira Masam: మార్గశిర మాసం మొదలైంది. శీమహావిష్ణవుకి, మహాలక్ష్మికి ఇష్టమైన మాసం మార్గశిర మాసం. సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మే భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహం అని చెప్పారు. ఈ మాసంలో..

Margasira Masam: ఆర్ధిక కష్టాలతో ఇబ్బంది పడుతున్నారా.. మార్గశిరంలో గురువారం లక్ష్మీదేవిని ఇలా పూజించండి..
Margasira Lakshmi Vratam
Follow us
Surya Kala

|

Updated on: Dec 06, 2021 | 9:06 PM

Margasira Masam: మార్గశిర మాసం మొదలైంది. శీమహావిష్ణవుకి, మహాలక్ష్మికి ఇష్టమైన మాసం మార్గశిర మాసం. సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మే భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహం అని చెప్పారు. ఈ మాసంలో విష్ణుప్రీతిగా చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది. పెద్ధలు ఈ మాసాన్ని మోక్ష మాసంగా లేదా మోక్ష సాధనా మాసం అని కూడా అంటారు. భక్తితో ఉపవాసం, జాగరణ ఉండి చేసే మోక్షద ఏకాదశి కూడా ఈ మాసంలోనే వస్తుంది. నిజానికి ఈ మాసానికి ఎందుకంత ప్రాముఖ్యత అంటే.. మార్గశిరం తరువాత వచ్చే పుష్యమాసం నుండి ఉత్తరాయణం మొదలు అవుతుంది. ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం. కార్తీక సోమవారంలా మార్గశిర లక్ష్మివారం (గురువారం) , మార్గశిర శనివారం చాలా ప్రాముఖ్యమైనవి.

మార్గశిరమాసంలో వచ్చే గురువారం లక్ష్మీదేవిని పూజిస్తే సకలైశ్వర్యాలూ కలుగుతాయని నమ్మకం. ఒక లక్ష్మీవారం విష్ణూపాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో “స్వామి ఈ రోజు మార్గశిర లక్ష్మీవారం. ప్రజలు నా వ్రతం చేసే రోజు. మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసే వారిని అనుగ్రహిస్తాను “అని పలికింది. కనుక మార్గశిర మాసంలో వచ్చే గురువారం మహా లక్ష్మీదేవి వ్రతమాచరిస్తే.. అమ్మవారి అనుగ్రహంతో ఆర్ధిక కష్టాలు తీరతాయని.. అష్టైశ్వర్యాలు పొందుతారని పురాణాల కథంనం

మార్గశిరమాసంలో వచ్చే గురువారం రోజున స్త్రీలు నియమానుసారంగా లక్ష్మీదేవిని పూజించి, వ్రతంలో చెప్పిన విధంగా నైవేద్యం సమర్పించి, వ్రతకథను చదువుకొనాలి. అలా అ మాసంలో వచ్చే అన్ని లక్ష్మివారాలూ ఈ వ్రతాన్ని ఆచరించాలి. పుష్య మాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా లక్ష్మీదేవిని పూజించి, ఆనాడు తమ శక్తికొలదీ ముత్తైదువలకి భోజనం పెట్టి, పసుపు, కుంకుమ పువ్వులు, తాంబూలం మొదలగు మంగళద్రవ్యాలనివ్వాలి. ఇలా నియమం తప్పకుండా చేసేవారి ఇంట లక్ష్మీదేవి కొలువుంటుంది అని పురాణప్రోక్తం.

Also Read:  ఆ దేశంలో జీవనోపాధి కోసం కొత్త మార్గం.. ప్రధాన వృత్తిగా బంగారం అన్వేషణ.. రోజుకో గ్రాము సంపాదన