వారానికి మూడు సార్లు ఈ చేపలు తింటే కిడ్నీ వ్యాధులు పరార్.. సైంటిస్టుల వెల్లడి..!!
ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్ల మందిపై సీకేడీ( క్రానిక్ కిడ్నీ డిసీజ్) ప్రభావం చూపుతోంది. ఈ రుగ్మత ఉన్నవారికి గుండె జబ్బు ముప్పు కూడా ఎక్కువగానే ఉంటుంది. దీంతో అది మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది.
చేపలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వారానికి కనీసం మూడు సార్లు క్రమం తప్పకుండా చేపలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చేపలను తినడం వల్ల ప్రోటీన్, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్ వంటి ఎన్నో పోషకాలతో పాటు సూర్యరశ్మి నుంచి లభించే విటమిన్ డి కూడా చేపల ద్వారా పొందొచ్చు. అలాగే చేప మాంసంలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాదు, ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనంలో మరో అద్భుత ఫలితం వెల్లడైంది. ఆయిలీ ఫీష్ ఆహారంగా తీసుకుంటే మూత్రపిండాల వ్యాధి(సీకేడీ) నుంచి రక్షణ పొందొచ్చని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 12 దేశాల వారిపై అధ్యయనం చేసి, ఈ మేరకు తేల్చారు.
ఆయిలీ ఫిష్ అంటే ఇతర చేపలతో పోలిస్తే వీటి లివర్, జీర్ణవ్యవస్థలో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. అందువల్లే వాటిని ఆయిలీ ఫిష్ అంటారు. సాల్మన్, ట్రౌట్, ట్యూనా, స్వోర్డ్‌ఫిష్, మాకరెల్, సార్డైన్స్, హెర్రింగ్ వంటి చేపలు ఈ జాతికి చెందుతాయి. ఇలాంటి ఆయిల్ ఫిష్ వారానికి రెండు సార్లు తింటే కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జార్జ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్, యూనివర్శిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ నేతృత్వంలోని ఈ అధ్యయనం BMJ మెడికల్ జర్నల్‌లో ప్రచురించబడింది . విభిన్న లింగం, జాతి, బాడీ మాస్ ఇండెక్స్, ఫిజికల్ యాక్టివిటీస్, మెడికల్ హిస్టరీ ఉన్నవారిని ఎంచుకున్నారు. వీరిలోనూ 49 నుంచి 77 ఏళ్ల మధ్య వయస్సు గల 12 విభిన్న దేశాల నుండి 25,000 కంటే ఎక్కువ మంది వ్యక్తులతో కూడిన 19 ట్రయల్స్ ఫలితాలను ఇది మిళితం చేసింది.
చేపల్లోని లాంగ్ చెయిన్ ఒమేగా-3 పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు (ఎన్ -3 పీయూ ఎఫ్‌ఏ) మానవ గుండె ఆరోగ్యానికి శ్రేయస్కరమని ఇప్పటికే తెలుసు. అది మూత్రపిండాలకూ మంచిదని తాజాగా వెల్లడైంది. ఈ ఆమ్లాల వల్ల కిడ్నీల పరితీరులో క్షీణత నెమ్మదిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మొక్కల నుంచి సేకరించిన ఎన్-3 పీయూఎఫ్‌ఏతో ఈ తరహా ప్రయోజనం కనిపించలేదని వారు పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్ల మందిపై సీకేడీ( క్రానిక్ కిడ్నీ డిసీజ్) ప్రభావం చూపుతోంది. ఈ రుగ్మత ఉన్నవారికి గుండె జబ్బు ముప్పు కూడా ఎక్కువగానే ఉంటుంది. దీంతో అది మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుంది. ఈ సీకేడీకి ప్రస్తుతం ఎలాంటి చికిత్స లేకపోవడం, ఈ కేసుల సంఖ్య క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజా పరిశోధన వైద్య రంగంలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..