Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HealthTips: ఈ చెట్టు బెరడు గుండె జబ్బులకు శత్రువు.. కొలెస్ట్రాల్, రక్తపోటు ప్రమాదాన్ని దూరం చేస్తుంది..!

ఇది కొత్త రక్త కణాలను ఏర్పాటు చేసి, రక్తహీనత ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది. ఇలా చేయ‌డం వ‌ల్ల జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య‌లు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

HealthTips: ఈ చెట్టు బెరడు గుండె జబ్బులకు శత్రువు.. కొలెస్ట్రాల్, రక్తపోటు ప్రమాదాన్ని దూరం చేస్తుంది..!
Arjuna Tree
Follow us
Jyothi Gadda

|

Updated on: Jan 21, 2023 | 5:15 PM

చెట్లలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పురాతన కాలం నుంచి చెట్ల సహాయంతో అనేక తీవ్రమైన వ్యాధులకు మన ఆయుర్వేదంలో చికిత్స చేయబడుతుంది. చెట్లు, మొక్కలలో ఉండే లక్షణాలు పలు రకాల వ్యాధులను నయం చేయడానికి పని చేస్తాయి. అలాంటిదే అర్జున చెట్టు..తెల్లమద్ది చెట్టు అని కూడా అంటారు. ఇది పోషకాల భాండాగారం అని కూడా అంటారు. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న అర్జునుడి బెరడును సేవించడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు దూరమవుతాయి. తెల్లమద్ది చెట్టు మనదేశంలో విస్తృతంగా పెరుగుతుంది. ఇది గుండెకు సంబంధించిన జబ్బులకు అత్యంత కీలకంగా పని చేస్తుంది. ఇది యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్ వంటి వివిధ ఔషధ లక్షణాలను కలిగి ఉంది. గుండె కండరాలను బలపరుస్తుంది. టోన్ చేస్తుంది. గుండె సరైన పనితీరుకు సహాయపడుతుంది.

ఒక అధ్యయనం ప్రకారం, అర్జున బెరడు సారం 23 శాతం కాల్షియం లవణాలు, 16 శాతం టానిన్లు, వివిధ ఫైటోస్టెరాల్స్, ఫ్లేవనాయిడ్లు, సాపోనిన్లు, స్టెరాల్స్ వంటి ఫైటోకెమికల్స్ ని కలిగి ఉంటుంది. గుండె ఆగిపోవడం, అధిక రక్తపోటు, కార్డియోమయోపతి, మయోకార్డియం నెక్రోసిస్, ఇస్కీమిక్, కొరోనరీ ఆర్టరీ డిసీజ్‌, అథెరోస్క్లెరోసిస్ వంటి అనేక గుండె సంబంధిత పరిస్థితులలో అర్జున కార్డియోటోనిక్ లా ఉపయోగించబడుతుంది. అర్జున బెరడు పాలలో ఉడకబెట్టి రోజుకు 1-2 సార్లు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదిని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇవి కూడా చదవండి
Arjuna Tree1

అర్జున యాంటీఆక్సిడెంట్ చర్య వల్ల ఫ్రీ రాడికల్స్ హానికరమైన ప్రభావాల నుండి గుండె కండరాన్ని రక్షించడం ద్వారా గుండెకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఇది కొత్త రక్త కణాలను ఏర్పాటు చేసి, రక్తహీనత ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది. మద్దిపట్ట చూర్ణము 1-2 స్పూన్‌ల చొప్పున అరకప్పు చక్కెర కలిపిన పాలతో తాగితే విరిగిన ఎముకలు త్వరగా అతుకుంటాయి. అలాగే ప్ర‌స్తుత చ‌లి కాలంలో గోరు వెచ్చ‌టి పాల‌ల్లో అర్జున బెర‌డు పొడిని అర స్పూన్ చప్పున క‌లిపి తీసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య‌లు ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..