Afghanistan: బొమ్మైనా సరే ముఖం కనిపిస్తే కఠిన చర్యలు తప్పవు.. మహిళలపై మరిన్ని ఆంక్షలు..

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ ఫోటోలు అక్కడి మహిళల దయనీయ పరిస్థితికి అద్దం పడుతున్నాయి.

Afghanistan: బొమ్మైనా సరే ముఖం కనిపిస్తే కఠిన చర్యలు తప్పవు.. మహిళలపై మరిన్ని ఆంక్షలు..
Taliban Rules
Follow us

|

Updated on: Jan 21, 2023 | 4:42 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల పాలన పరిస్థితి పరాకాష్టకు చేరింది. ఇక్కడి మహిళల పట్ల తాలిబన్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఆడవారిపై అనేక ఆంక్షలు విధించి అమలు చేస్తున్నారు. మహిళలు చదువుకోవడం, జిమ్‌కి వెళ్లడం, పబ్లిక్ పార్క్ లేదా అమ్యూజ్‌మెంట్ పార్క్‌తో సహా పురుషుడు తోడు లేకుండా దూర ప్రయాణాలకు వెళ్లడాన్ని నిషేధించారు. తాలిబన్ ప్రభుత్వం తాజాగా మరో ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. ఆఫ్ఘనిస్తాన్‌లోని టెక్స్‌టైల్ షాపుల్లోని బొమ్మల ముఖాల ముఖాలకు కూడా ముసుగు వేయాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన భయానక చిత్రాలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. విశాలమైన దుస్తులు ధరించిన బొమ్మల ముఖాలను పాలిథిన్ బ్యాగ్‌లు, స్కార్ఫ్‌లు, రేకులతో కప్పి ఉంచాలని దుకాణదారులపై ఒత్తిడి చేసింది ప్రభుత్వం.

ఆఫ్ఘన్‌లో ఆడవాళ్ళే కాదు.. స్త్రీని పోలిన బొమ్మైనా సరే ముఖం కనిపించకూడదనే నిబంధనలు పెట్టింది తాలిబన్‌ ప్రభుత్వం. ఈ మేరకు దేశవ్యాప్తంగా దుకాణదారులకు ఆదేశాలు జారీ చేసింది. బట్టల దుకాణాల ముందు షాపుల ముందు, లోపల మహిళల బొమ్మలు, ముఖాలు కనిపించకుండా తప్పనిసరిగా బురఖా ధరించాలని ఆదేశించింది. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ ఫోటోలు అక్కడి మహిళల దయనీయ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. ప్రపంచం వారికి అండగా నిలబడకపోతే ఆఫ్ఘన్ ఆడవారి జీవితం ఎంత అధ్వాన్నంగా మారబోతోంది.. అంటూ సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇవి కూడా చదవండి

ఆగస్ట్ 2021లో తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత దేశంలోని పౌరులు, ముఖ్యంగా మహిళల దుస్థితి దిగజారిపోయింది. విద్యపై నిషేధం నుండి జిమ్‌లు, పబ్లిక్, వినోద ఉద్యానవనాలలో ప్రవేశం వరకు, ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలు చాలా కష్టాలు పడుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..