జపాన్‌లో భూకంపం సంభవించింది. జపాన్ తీరంలోని పసిఫిక్ మహాసముద్రంలో భూకంపం వచ్చింది. మంగళవారం త్లెలవారుజామున రిక్టార్ స్కేల్‌పై 5.9 తీవ్రతతో భూమి కంపించింది. జపాన్ దీవులైన ఇజు ఐలాండ్‌లో రిక్టర్ స్కేల్‌పై 5.6 భూకంపం నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ భూకంపం వల్ల ఒక మీటరు పరిధితో కూడిన సునామీ వచ్చే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది.
జపాన్ తీరంలోని పసిఫిక్ మహాసముద్రంలో భూకంపం సంభవించింది. మంగళవారం త్లెలవారుజామున రిక్టార్ స్కేల్‌పై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించటంతో.. జపాన్ దీవులైన ఇజు, ఒగాసవారాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీచేశారు.
జపాన్ రాజధాని టోక్యోకు 600 కిలోమీటర్ల దూరంలోని తోరిషిమా ద్వీపంలో సంభవించిన భూకంపంతో ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని ఆ దేశ వాతావరణ సంస్థ వెల్లడించింది. భూకంపం తమపై ఎలాంటి ప్రభావం చూపలేదని అటు ఐలాండ్ నివాసితులు సైతం తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..