ఎన్నో ఆశలతో కలలతో అందమైన భవిష్యత్ ని ఊహించుకుంటూ కన్నవారిని, సొంత ఊరిని వదిలి విదేశాల బాట పడుతున్నారు. అక్కడ ప్రమాదాల బారిన పడి లేక దుండగుల చేతిలోనో ప్రాణాలు పోగొట్టుకుని ఊరు కాని ఊరులో కన్నుమూస్తున్నారు. కన్నవారికి కడుపుకోత మిగులుస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువతి ఆస్ట్రేలియాలో కన్ను మూసింది. సరదాగా స్నేహితులతో గడపడానికి ట్రెక్కింగ్ కి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఆస్ట్రేలియాలో తెలుగు డాక్టర్ మృతి చెందింది. స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్ వెళ్లిన డాక్టర్ ఉజ్వల.. ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడి మరణించింది. మృతురాలు కృష్ణా జిల్లా గన్నవరంకు చెందిన ఉజ్వలగా గుర్తించారు. ఆస్ట్రేలియాలోని స్నేహితులు తల్లిదండ్రులకు సమాచారం. ఉజ్వల స్వగ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. కూతురు మరణంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు.
ఆస్ట్రేలియా గోల్డ్‌కోస్ట్‌లోని బాండ్ విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఉజ్వల.. ప్రస్తుతం రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆసుపత్రిలో డాక్టర్ గా విధులు నిర్వహిస్తోంది. ఈ రోజు మృతదేహం కృష్ణాజిల్లా స్వగ్రామానికి తరలించనున్నారు. అనంతరం ఉంగుటూరు మండలం ఎలుకపాడులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..