AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2025: అమెరికాలో మరో రాష్ట్రంలో దీపావళి పండగకు గుర్తింపు.. అధికారిక సెలవుదినంగా ప్రకటన

ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఎక్కడోచోట భారతీయులు, భారతీయ మూలాలున్న వ్యక్తులు కనిపిస్తారని అంటారు. విద్య, ఉపాధి, ఉద్యోగం ఇలా పలుకారణాలతో జన్మ భూమిని వదిలి ఇతర దేశాలకు వెళ్లి అక్కడే స్థిరపడినవారు ఎందరో ఉన్నాడు. ఎక్కడ ఉన్నా భారతీయ సంస్కృతిని , సాంప్రదాయాన్ని విడిచి పెట్టరు. పండగలు, పర్వదినాలను ఎంతో ఇష్టంగా జరుపుకుంటారు. అలా అమెరికాలో ఉన్న భారతీయులు కూడా ప్రతి హిందూ పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దీంతో అక్కడవారికి మన పండగలు సుపరిచితంగా మారాయి. తాజాగా యుఎస్ లో కాలిఫోర్నియా దీపావళిని పండగను అధికారికంగా గుర్తించింది. సెలవు దినంగా ప్రకటించింది.

Diwali 2025: అమెరికాలో మరో రాష్ట్రంలో దీపావళి పండగకు గుర్తింపు.. అధికారిక సెలవుదినంగా ప్రకటన
California Designates Diwali As State Holiday
Surya Kala
|

Updated on: Oct 09, 2025 | 10:57 AM

Share

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి దీపావళి పండగకు పట్టంగట్టింది. కాలిఫోర్నియాలో దీపావళిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకుంది. వెలుగులు నింపే దీపావళి పండగను అధికారిక సెలవు దినంగా ప్రకటించింది. దీంతో అమెరికాలో హిందువులు జరుపుకునే దీపావళి పండగను అధికారికంగా సెలవు దినంగా ప్రకటించిన మూడవ రాష్ట్రంగా నిలిచింది . ఇది అమెరికాలోని భారతీయ ప్రవాసులకు చారిత్రాత్మక పరిణామం అని చెబుతున్నారు. కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ మంగళవారం దీపావళిని రాష్ట్ర సెలవుదినంగా ప్రకటిస్తూ అసెంబ్లీ సభ్యుడు ఆష్ కల్రా బిల్లుపై సంతకం చేసినట్లు ప్రకటించారు.

సెప్టెంబర్‌లో దీపావళిని అధికారిక రాష్ట్ర సెలవుదినంగా పేర్కొనే ‘AB 268’ అనే బిల్లు కాలిఫోర్నియాలోని శాసనసభ ఉభయ సభల సభ్యుల నుంచి విజయవంతంగా ఆమోదించింది. కాలిఫోర్నియాలో అత్యధిక జనాభా కలిగిన భారతీయ అమెరికన్లు ఉన్నారు. దీపావళిని అధికారిక రాష్ట్ర సెలవుదినంగా పేర్కొనడం వల్ల కాలిఫోర్నియా ప్రజలకు భిన్నత్వంలో ఏకత్వం అనే సందేశం అర్ధం అవుతుందని కల్రా గత నెలలో చెప్పారు

దీపావళి పండగ అనేది సద్భావన, శాంతి , ఉమ్మడి పునరుద్ధరణ భావనతో సమాజాలను ఒకచోట చేర్చుతుంది. కాలిఫోర్నియా దీపావళిని .. దాని వైవిధ్యాన్ని స్వీకరించాలి.. చీకటిలో దాచకూడదు” అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి

దీపావళిని రాష్ట్ర సెలవు దినంగా అధికారికంగా గుర్తించిన మొదటి రాష్ట్రం పెన్సిల్వేనియా. ఇక్కడ అక్టోబర్ 2024లో దీపావళి పండగకు ఈ గుర్తింపు దక్కింది. తర్వాతక నెక్టికట్ 2025 జూన్‌లో దీపావళిని రాష్ట్ర సెలవుదినంగా గుర్తించింది. న్యూయార్క్ నగరంలో ప్రభుత్వ పాఠశాలలు దీపావళిని సెలవు దినంగా ప్రకటించారు.

మరిన్ని అంతర్జతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..