AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వరకట్న దాహానికి మరో యువత బలి.. పెళ్ళైన నాలుగు నెలలకే భార్యని చంపేసిన భర్త

వరకట్న దాహానికి మరొక ఆడబడుచు బలి అయిపొయింది. పెళ్లి జరిగి నాలుగు నెలలు.. కాళ్ళ పారాణీ ఆరక ముందే భర్త చేతిలో మరణించింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. ఓ ప్రభుద్దుడు భార్యని చంపి ఆ శవాన్ని మంచం కింద దాచి పెట్టి పారిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..

వరకట్న దాహానికి మరో యువత బలి.. పెళ్ళైన నాలుగు నెలలకే భార్యని చంపేసిన భర్త
Man Kills Wife
Surya Kala
|

Updated on: Oct 09, 2025 | 10:11 AM

Share

కర్ణాటకలోని బెలగావిజిల్లాలోని కమలాదిన్ని గ్రామంలో ఒక వ్యక్తి పెళ్లైన నాలుగు నెలలకే తన భార్యను హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ఇంట్లో మంచం కింద దాచిపెట్టి పారిపోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అదనపు కట్నం తీసుకుని రమ్మంటే ఆ యువతి కట్నం తీసుకురావడాన్ని వ్యతిరేకించిందని.. అందుకే భార్యను హత్య చేసి మంచం కింద దాచి పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నిందితుడు భర్త కోసం గాలింపు ముదలగి తాలూకాలోని కమలాదిన్నికి చెందిన ఆకాష్ కుంబర తన భార్య సాక్షి ఆకాష్ కుంబర (20)ను హత్య చేసి పారిపోయాడు. ఈ విషయంపై ముదలగి పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు చేయబడింది. పరారీలో ఉన్న భర్త ఆకాష్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

నాలుగు నెలల క్రితం వివాహం సాక్షికి ఆకాష్ తో నాలుగు నెలల క్రితమే వివాహం జరిగింది. పెళ్లి తర్వాత తన భార్యను పుట్టింటి ఇంటి నుంచి మరింత కట్నం తీసుకుని రమ్మనమని ఆకాష్ .. తన భార్య అయిన సాక్షిని నిత్యం వేధించే వాడని చెబుతున్నారు. మూడు రోజుల క్రితం తన భార్యని హత్య చేసి పారిపోయాడు. మహిళ హత్య జరిగినప్పటి నుంచి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని పోలీసు వర్గాలు చెప్పాయి. ముంబైకి వెళ్లిననిందితుడు ఆకాష్ కంబర్ తల్లి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆమెకు తన కోడలు సాక్షి మృతదేహం కనిపించింది. ఇలా ఆకాష్ చేసిన నేరం బయటపడింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..