AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquake: భూటాన్‌లో తెల్లవారుజామున భూకంపం.. మళ్ళీ కంపించే అవకాశం ఉందని హెచ్చరిక

గురువారం ఉదయం భూటాన్‌లో 3.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం లోతు 5 కిలోమీటర్లు.. అయితే మళ్ళీ భూ ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు హెచ్చారిస్తున్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటికే రెండు సార్లు ప్రకంపనలు సంభవించగా.. ఇప్పుడు మళ్ళీ భూమి కంపించింది. భూటాన్ హిమాలయ ప్రాంతంలో ఉండటం వలన భారత భూకంప మండలాలు IV , Vలలో పడటం వలన భూకంపాలకు ఎక్కువగా గురవుతుంది.

Earthquake: భూటాన్‌లో తెల్లవారుజామున భూకంపం.. మళ్ళీ కంపించే అవకాశం ఉందని హెచ్చరిక
Earthquake In Bhutan
Surya Kala
|

Updated on: Oct 09, 2025 | 8:04 AM

Share

భూటాన్‌లో గురువారం ఉదయం 3.1 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఉదయం 4:29 గంటలకు భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) నివేదించింది. భూకంపం లోతు కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే, అనంతర మళ్ళీ ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సంవత్సరం భూటాన్‌ను తాకిన మొదటి భూకంపంమాత్రమె ఇది కాదు. గతంలో సెప్టెంబర్ 8, 2025న భూటాన్‌లో రెండు భూకంపాలు సంభవించాయి. మొదటి భూకంపం, 2.8గా నమోదైంది, మధ్యాహ్నం 12:49 గంటలకు 10 కిలోమీటర్ల లోతుతో నమోదైంది. రెండవ భూకంపం, 4.2గా నమోదైంది, ఉదయం 11:15 గంటలకు సంభవించింది. రెండు ప్రకంపనలు భూటాన్‌లోని వివిధ ప్రాంతాలలో సంభవించాయి.

ఈ వీడియో కూడా చూడండి

భూకంప నిపుణుల అభిప్రాయం ప్రకారం ఉపరితల భూకంపాలు మరింత ప్రమాదకరమైనవిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే వీటు ప్రకంపనలు త్వరగా, ఎక్కువ తీవ్రతతో భూమిని చేరుతాయి. ఇది నష్టం జరిగే అవకాశాన్ని పెంచుతుంది.

భూటాన్ భూకంపాలకు గురయ్యే ప్రాంతం. భూటాన్ హిమాలయ పర్వత శ్రేణిలో ఉంది, ఇది ప్రపంచంలోనే అత్యంత భూకంప-ప్రమాదకర ప్రభావిత ప్రాంతాలలో ఒకటి. ఆసియన్ డిజాస్టర్ రిడక్షన్ సెంటర్ (ADRC) ప్రకారం భూటాన్ అత్యంత భూకంప క్రియాశీల ప్రాంతాలైన భారతీయ భూకంప మండలాలు IV, V పరిధిలోకి వస్తుంది. గత భూకంపాలు భూటాన్‌లో భూకంపాలు అత్యంత ముఖ్యమైన సహజ ప్రమాదంగా ఉన్నాయని నిరూపించాయి.

భూటాన్‌లో ఇతర ప్రమాదాల భయం భూటాన్ భూకంపాలకు మాత్రమే కాకుండా, అనేక ఇతర ప్రకృతి వైపరీత్యాలకు కూడా గురవుతుంది. హిమనదీయ సరస్సు విస్ఫోటనాలు, కొండచరియలు విరిగిపడటం, బలమైన గాలులు, ఆకస్మిక వరదలు, కార్చిచ్చులు వంటి ప్రకృతి వైపరీత్యాలు తరచుగా నష్టాన్ని కలిగిస్తున్నాయి. 2011 , 2013లో బలమైన గాలులు వేలాది గ్రామీణ ఇళ్లను దెబ్బతీశాయి.

అస్సాంలోని గౌహతిలో సాయంత్రం 4:41 గంటలకు 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది, దీని ప్రకంపనలు ఉత్తర బెంగాల్ మరియు పొరుగున ఉన్న భూటాన్ వరకు సంభవించాయి. భూకంప కేంద్రం ఉదల్గురి పట్టణంలో ఉందని భారతదేశ జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం తెలిపింది. గువహతిలో భయంతో నివాసితులు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

ఇప్పటివరకు ఎటువంటి గాయాలు లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు అందలేదు. ఈశాన్య ప్రాంతం అధిక భూకంప జోన్‌లో ఉండటం వల్ల ఈ ప్రాంతంలో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఎటువంటి పెద్ద నష్టం లేదా ప్రాణనష్టం జరిగినట్లు నివేదికలు లేవు” అని మరియు అతని పరిపాలన “పరిస్థితిని చురుగ్గా పర్యవేక్షిస్తోంది” అని ముఖ్యమంత్రి హిమంత శర్మ అన్నారు.

అస్సాం మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం కేంద్ర ఓడరేవుల మంత్రిగా ఉన్న సర్బానంద సోనోవాల్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. “అస్సాంలో పెను భూకంపం. అందరి భద్రత , శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేస్తున్నట్లు.. అందరూ అప్రమత్తంగా ఉండాలని సర్బానంద సోనోవాల్ X లో పోస్ట్ చేసారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..