Philippines Floods: ఫిలిప్పీన్స్‌లో రాయ్ తూపాను బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య..
ఫిలిప్పీన్స్‌లో టైఫూన్ రాయ్ మహా విలయాన్ని సృష్టించింది. వేలసంఖ్యలో ఇళ్లు నేలమట్టం అయ్యాయి. మృతుల సంఖ్య వంద దాటింది. వరదల్లో చిక్కకున్నవారిని రక్షించే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
ఫిలిప్పీన్స్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఉష్ణమండల అల్పపీడనం వల్ల దక్షిణ ఫిలిప్పీన్స్‌లో గతకొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటం సహా వివిధ ఘటనల్లో సుమారు 58 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం. మరో 15 మంది ఆచూకీ గల్లంతైందని అధికారులు వెల్లడించారు. లెయిటే రాష్ట్రంలోని బేబే నగరం వరదలతో అతలాకుతలమవుతోంది. గత శుక్రవారం నుంచి ఇక్కడ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వందమందికి పైగా ప్రజలకు తీవ్ర గాయాపడ్డారు. పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని అక్కడి అధికారిక మీడియా తెలిపింది. రోడ్లపై బురద, మట్టిదిబ్బలు పేరుకుపోవడం వల్ల పోలీసులు, ఆర్మీ దళాలు ముందుకు వెళ్లలేకపోతున్నాయి.
బేబే గ్రామాల్లో 36 మృతదేహాలను గుర్తించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. సమర్, నెగ్రోస్ ఓరియెంటల్ ప్రాంతాల్లో పలువురు గల్లంతయ్యారని చెప్పారు. సహాయక చర్యల కోసం అధునాతన యంత్రాలను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. కోస్ట్ గార్డ్ సైతం రంగంలోకి దిగింది. అగ్నిమాపక దళాలు, పోలీసులతో కలిసి కొంతమంది గ్రామస్థులను కాపాడినట్లు కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. వరదల నేపథ్యంలో స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. ఇక కోస్ట్‌గార్డు, నేవీ అధికారులు, ఆర్మీ కూడా రంగంలోకి దిగింది. తీర ప్రాంతంలో ఉన్న వారికి ఆహారం, నీరు అందించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏరియల్ వ్యూలో చూస్తే.. వందలాది ఇళ్లు నేలమట్టమై కనిపిస్తున్నాయి. భారీ వృక్షాలు విరిగి రోడ్లకు అడ్డంగా పడ్డాయి. ఎక్కడ చూసినా.. భయానక పరిస్థితులే కనిపిస్తున్నాయి.
అయితే గత ఏడాది కూడా ఇదే సమయంలో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన సూపర్ టైఫూన్ రాయ్(Tropical Storm), ఫిలిప్పీన్స్‌ను ఛిన్నాభిన్నం చేసింది. రాయ్ తుఫాన్ ధాటికి 112 మంది మరణించిన సంగతి తెలిసిందే. 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 8 లక్షల మంది ప్రజలు దీని ప్రభావానికి గురయ్యారని ప్రభుత్వం వెల్లడించింది. ఫిలిప్పీన్స్ లో ఎక్కడ చూసినా రాయ్ విధ్వంసం తాలూకు ఆనవాళ్లే కనిపిస్తున్నాయి. బీచ్ ల వద్ద ఉండే రిసార్టులు నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకు పోయాయి. విద్యుత్, కమ్యూనికేషన్ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇళ్లు, కార్యాలయాలు, ఆసుపత్రులు పైకప్పుల్లేని స్థితిలో దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం టైఫూన్ రాయ్ ఫిలిప్పీన్స్ దాటి వెళ్లిపోవడంతో దేశంలో సహాయచర్యలు ముమ్మరం చేశారు.
ఇవి కూడా చదవండి: Pranahita Pushkaralu: ఇవాళ్టి నుంచి ప్రాణహిత నది పుష్కరాలు.. మధ్యాహ్నం తర్వాత నదిలోకి పుష్కర పురుషుడు..
Tree City: భాగ్యనగరానికి మరో అరుదైన గుర్తింపు.. రెండోసారి ట్రీ సిటీగా..