PM Modi: జీ-7 స‌ద‌స్సుకు ప్రధాని మోదీని ఆహ్వానించడంపై జపాన్ తర్జనభర్జన.. కారణం ఇదే..!

PM Modi: జీ-7 స‌ద‌స్సుకు ప్రధాని మోదీని ఆహ్వానించడంపై జపాన్ తర్జనభర్జన.. కారణం ఇదే..!
Putin And Modi

G-7 Summit 2022 - India: ఉక్రెయిన్‌‌పై రష్యా దండయాత్రను భారత్ ఇప్పటివరకు ప్రశ్నించలేదు.. దీనిపై ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. ఇరుదేశాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలంటూ.. తటస్థ వైఖరిని అవలంభిస్తూ వస్తోంది.

Shaik Madarsaheb

|

Apr 13, 2022 | 1:50 PM

G-7 Summit 2022: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య పలు దఫాలుగా జరిగిన చర్చలు సైతం విఫలమయ్యాయి. దీంతో రష్యా ఉక్రెయిన్‌పై బాంబులతో విరుచుకుపడుతోంది. ప్రపంచ దేశాలన్నీ సూచనలు చేస్తున్నా.. ఏమాత్రం పట్టించుకోకుండా దాడులను ముమ్మరం చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్ సైన్యానికి ఆదేశించారు. దీంతో ఉక్రెయిన్‌లో పరిస్థితులు భీకరంగా మారాయి. అయితే.. రష్యా దండయాత్రపై భారత్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇరుదేశాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలంటూ.. తటస్థ వైఖరిని అవలంభిస్తూ వస్తోంది. అటు రష్యా.. ఇటు ఉక్రెయిన్ మధ్య ఉన్న దౌత్య సంబంధాల సాన్నిహిత్యంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో జీ-7 సదస్సుకు భారత్‌ను ఆహ్వానించేందుకు జర్మనీ తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. జూన్‌లో నిర్వహించే గ్రూప్ ఆఫ్ సెవెన్ సమ్మిట్‌ (G7) కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించాలా వద్దా..? అనే విషయాన్ని జర్మనీ ఆలోచిస్తున్నట్లు అంతర్జాతీయా మీడియా పేర్కొంది.

ఉక్రెయిన్‌పై దాడిని రష్యాను ఖండించడానికి భారత్ ఇష్టపడని కారణంగా.. జీ7 సమ్మిట్‌కు ప్రధాని మోడీని ఆహ్వానించాలా..? వద్దా..? అనే విషయాన్ని చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. బవేరియాలో జరిగే ఈ సమావేశంలో భారతదేశానికి బదులుగా.. దక్షిణాఫ్రికా, ఇండోనేషియాలను అతిథులుగా చేర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే.. దీనిపై ఇంకా జర్మనీ నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది. జీ7 ఏడు దేశాల బృందంలో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా సభ్యులుగా ఉన్నాయి. అయితే.. ఈ సమావేశానికి అతిథులను సైతం ఆహ్వానిస్తారు. కాగా.. ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమయ్యే ముందు రూపొందించిన జాబితాలో భారతదేశం ఉంది.. కాగా దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదని జీ7 బృందంలోని ఓ సభ్యుడు పేర్కొన్నట్లు మీడియా పేర్కొంది. UN మానవ హక్కుల మండలి నుంచి రష్యాను సస్పెండ్ చేయడానికి ఐక్యరాజ్యసమితి ఓటింగ్‌కు దూరంగా ఉన్న 50 కంటే ఎక్కువ దేశాలలో భారతదేశం కూడా ఉంది. ఇవన్నీ మాస్కోపై ఆంక్షలు విధించలేదు. అంతేకాకుండా రష్యా ఆయుధాలను గణనీయంగా కొనుగోలు చేస్తున్నాయి. దీంతోపాటు పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్‌లను అరికట్టాల్సిన అవసరం ఉందంటూ ప్రతినిధులు అభిప్రాయపడ్డట్లు పేర్కొంటున్నారు.

దీనిపై జర్మనీ ప్రభుత్వ ప్రతినిధి స్టెఫెన్ హెబెస్ట్రీట్ మాట్లాడుతూ.. బెర్లిన్ అతిథుల జాబితాను ఖరారు చేసిన వెంటనే సమాచారాన్ని అందజేస్తుందని తెలిపారు. సాధ్యమైనంత ఎక్కువ మంది అంతర్జాతీయ భాగస్వాములు రాష్యాపై ఆంక్షలు విధించాలని కోరుకుంటున్నట్లు ఛాన్సలర్ స్పష్టం చేశారని హెబెస్ట్రీట్ చెప్పారు. కాగా దీనిపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.

ఇదిలాఉంటే.. రష్యాపై ఆంక్షలు విధించడంలో G7 దేశాలు ముందున్నాయి. కొన్ని ఉక్రెయిన్‌కు ఆయుధాలను సైతం పంపాయి. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఖండించడానికి వారు ఇతర దేశాలను సైతం మాట్లాడారు. దీంతోపాటు రష్యాతో వాణిజ్యం, పెట్టుబడులపై పరిమితులు విధించాయి.

Also Read:

Russia: అంతర్జాతీయ సమాజం విన్నపాలను ఏ మాత్రం పట్టించుకోని పుతిన్‌.. రష్యా యుద్ధోన్మాదానికి బలవుతున్న పసిపిల్లలు

LPG Price: భారత్‌లోనే గ్యాస్ ధర అత్యధికం.. ప్రపంచంలో పెట్రోల్, డీజిల్ రేట్లల్లో ఎన్నో స్థానంలో ఉన్నామంటే..?

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu