LPG Price: భారత్‌లోనే గ్యాస్ ధర అత్యధికం.. ప్రపంచంలో పెట్రోల్, డీజిల్ రేట్లల్లో ఎన్నో స్థానంలో ఉన్నామంటే..?
India’s LPG cost highest in world; దేశంలో ఇంధన ధరలు రోజురోజుకు మండిపోతున్నాయి. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ (LPG - CNG) ధరలతో సమాన్యులు లబోదిబోమంటున్నారు.
India’s LPG cost highest in world; దేశంలో ఇంధన ధరలు రోజురోజుకు మండిపోతున్నాయి. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ (LPG – CNG) ధరలతో సమాన్యులు లబోదిబోమంటున్నారు. అయితే ప్రపంచంలోనే అత్యంత ప్రియంగా LPG ఇప్పుడు భారతదేశంలో దొరుకుంతుందన్న విషయం మీకు తెలుసా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన LPG భారతదేశంలో ఎలా అందుబాటులో ఉంది అనేదానికి కరెన్సీల కొనుగోలు శక్తిని లెక్కించడం ద్వారా సమాధానాన్ని కనుగొనవచ్చు. అయితే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉన్న అనేక విషయాలను ముందు మనం అర్థం చేసుకోవాలి. ఈ లెక్కన పెట్రోల్ ధర ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉండగా, డీజిల్ ధరల పరంగా 8వ స్థానంలో ఉన్నాం.
కొనుగోలు శక్తి గణాంకాలను ఇలా అర్థం చేసుకోండి..
ఉదాహరణకు.. మన దేశంలో ఉన్న రూపాయితో మనం నేపాల్‌లోని రూపాయి కంటే ఎక్కువ కొనుగోలు చేయవచ్చు. అమెరికాలో మనం ఒక్క రూపాయికి ఏమీ కొనలేము. అంటే ప్రతి కరెన్సీకి వారి స్థానిక మార్కెట్‌లో ఎంత.. ఏ వస్తువులను కొనుగోలు చేయవచ్చనే దానికి ‘కొనుగోలు శక్తి’ ఉంటుంది. వివిధ దేశాల కరెన్సీల కొనుగోలు శక్తి మారుతూ ఉంటుంది. కానీ కరెన్సీ అంతర్జాతీయ మార్కెట్‌కు చేరుకునే కొద్దీ కొనుగోలు శక్తి మారుతూ వస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా కరెన్సీల మధ్య అంతర్జాతీయ మార్కెట్‌లో జరిగే మార్పులు ఏవైనా వాణిజ్యం నామమాత్రపు మారకం రేటుతో జరుగుతుంది. దీంతో దేశం కరెన్సీ.. కొనుగోలు శక్తిని తదనుగుణంగా నిర్ణయిస్తారు. ఒక్కో దేశంలోని ఆయా ప్రజల ఆదాయంలో చాలా తేడా ఉంటుంది. ఒక సగటు భారతీయుడు భారతదేశంలో ఒక లీటరు పెట్రోలు కొనుగోలు చేయడం అతని రోజువారీ ఆదాయంలో నాలుగింత ఒక వంతు అయితే.. ఒక అమెరికన్‌కి ఇది అతని రోజువారీ ఆదాయంలో కొంత భాగం మాత్రమే ఉంటుంది.
ఈ విధంగా కొనుగోలు శక్తి సమానత్వ సూత్రాన్ని నిర్ణయిస్తారు. ఇది ఒక దేశంలోని పౌరుడికి మరొక దేశంలో ఎంత కొనుగోలు శక్తి ఉందో తెలియజేస్తుంది. ఉదాహరణకు మీరు భారతదేశంలో 100 రూపాయలతో జీవించవచ్చని గ్రహిస్తే, అమెరికాలో అదే జీవితాన్ని గడపడానికి మీకు 4.4.55 (సుమారు రూ. 345) అవసరం.
లీటర్ LPG 3.5 డాలర్లు..
కొనుగోలు శక్తి సమానత్వం ఫార్ములా ప్రకారం చూస్తే.. భారతీయులు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన LPGని కొనుగోలు చేస్తున్నారు. దీనికోసం అంతర్జాతీయ డాలర్లలో లీటరుకు 3.5గా చెల్లిస్తున్నారు. అయితే.. టర్కీ, ఫిజీలో ధరలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం సగటు భారతీయుడు పెట్రోల్‌కు 5.2 మరియు డీజిల్‌కు 4.6 డాలర్ల చొప్పున చెల్లిస్తున్నాడు.
Also Read: