West Bengal: కలకత్తా హైకోర్టులో టీఎంసీ న్యాయవాదుల ఓవరాక్షన్.. కోర్టులోకి వెళ్లకుండా జడ్జిని అడ్డుకొని..

Calcutta High Court: స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) కేసులో వెలువడిన తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) కు చెందిన లీగల్‌ విభాగం నాయకులు ఆందోళనకు దిగడం వివాదాస్పదంగా మారింది.

West Bengal: కలకత్తా హైకోర్టులో టీఎంసీ న్యాయవాదుల ఓవరాక్షన్.. కోర్టులోకి వెళ్లకుండా జడ్జిని అడ్డుకొని..
Ssc Corruption Case
Follow us
Basha Shek

|

Updated on: Apr 13, 2022 | 3:20 PM

Calcutta High Court: స్కూల్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) కేసులో వెలువడిన తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) కు చెందిన లీగల్‌ విభాగం నాయకులు ఆందోళనకు దిగడం వివాదాస్పదంగా మారింది. వారు కలకత్తా హైకోర్టులోని జస్టిస్‌ అభిజిత్‌ గంగోపాధ్యాయ గది ముందు బైఠాయించారు. జస్టిస్‌ను గదిలోకి పోనివ్వకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఎస్‌సీ కేసులో తీర్పును వెలువరించిన అభిజిత్‌ గంగోపాధ్యాయ (Justice Abhijit Gangopadhyay) ను బహిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు కలకత్తా హైకోర్టు బార్‌ అసోసియేషన్‌కు వినతిపత్రం కూడా సమర్పించారు. మరోవైపు ఇదే కేసులో జస్టిస్‌ అభిజిత్‌ గంగోపాధ్యాయ తీర్పు సమర్థనీయమే అంటూ మరికొందరు న్యాయవాదులు మద్దతు తెలుపుతున్నారు. దీంతో కలకత్తా హైకోర్టు న్యాయవాదులు రెండు విభాగాలుగా విడిపోయారు. ఇక ఎస్‌ఎస్‌సీ కేసు విషయానికొస్తే.. పశ్చిమ బెంగాల్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు తలెత్తాయి.

తీర్పుకు వ్యతిరేకంగా..

ఈ కేసును జస్టిస్‌ గంగోపాధ్యాయ నేతృత్వంలోని సింగిల్‌ జడ్జి బెంచ్‌ విచారించి సుప్రీంకోర్టు జోక్యాన్ని కోరింది. అంతేకాదు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థ ఛటర్జీ సీబీఐ విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే మంత్రిని అదుపులోకి తీసుకోని విచారించవచ్చని ఉత్తర్వులు వెలువరించింది. ఈక్రమంలో సీబీఐ విచారణను తప్పించుకోవడానికి మంత్రిని ఆస్పత్రిలో చేర్చడానికి కూడా అనుమతించబోమని జస్టిస్‌ గంగోపాధ్యాయ తీర్పు వెలువరించారు. దీనిపై టీఎంసీ నేతలు భగ్గుమన్నారు. ఇందులో భాగంగానే కలకత్తా హైకోర్టు భవనంలోని జస్టిస్‌ గంగోపాధ్యాయ గది ముందు టీఎంసీ లీగల్‌ విభాగం నాయకులు ఆందోళనకు దిగారు. కాగా జస్టిస్ గంగోపాధ్యాయ జారీ చేసిన ఉత్తర్వులపై కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం ఉదయం వరకు స్టే విధించింది.

Also Read:Tirumala: స్వామివారి సన్నిధిలో వారం రోజుల పాటు ఉండే భాగ్యం.. ఎలా అనుమతి తీసుకోవాలో పూర్తి వివరాలు మీ కోసం..

Rashmi Gautam:పింక్ డ్రెస్ లో వయ్యారాలు ఒలకబోస్తున్న యాంకర్ రష్మి.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Viral Video: వామ్మో! ‘బాహుబలి’ మొసలి.. బరువు ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంకే.!