AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rafale: వాళ్ల మొహం.. అన్నీ అబద్ధాలే..! పాకిస్థాన్‌ పరువు తీసిన రాఫెల్ కంపెనీ CEO

భారత్-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల సమయంలో జరిగిన ఆపరేషన్ సిందూర్ లో రాఫెల్ యుద్ధ విమానాలను పాకిస్థాన్ కూల్చివేసిందని చేసిన వాదనను డస్సాల్ట్ ఏవియేషన్ CEO ఎరిక్ ట్రాపియర్ తప్పబట్టారు. పాకిస్థాన్ వాదన తప్పు అని, రాఫెల్ విమానాలకు ఎటువంటి నష్టం జరగలేదని ఆయన స్పష్టం చేశారు.

Rafale: వాళ్ల మొహం.. అన్నీ అబద్ధాలే..! పాకిస్థాన్‌ పరువు తీసిన రాఫెల్ కంపెనీ CEO
Pak Pm And Dassault Ceo
SN Pasha
|

Updated on: Jun 15, 2025 | 3:17 PM

Share

కొన్ని వారాల క్రితం భారత్‌-పాక్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఏప్రిల్‌లో జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఆపరేషన్‌ సిందూర్‌ను చేపట్టి.. పాకిస్థాన్‌, పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది. అయితే.. ఈ దాడి సమయంలో భారత్‌కు చెందిన రాఫెల్ యుద్ధ విమానాలను కూల్చేశామని అప్పట్లో పాకిస్థాన్‌ ప్రకటించింది. కానీ, పాకిస్థాన్‌ వాదనను ఫ్రెంచ్ విమానాల తయారీ సంస్థ డస్సాల్ట్ ఏవియేషన్ CEO ఎరిక్ ట్రాపియర్ ఆ ఆరోపణలను ‘తప్పు’ అని పేర్కొన్నారు.

ఫ్రెంచ్ మ్యాగజైన్ ఛాలెంజెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆపరేషన్ సిందూర్ సమయంలో రాఫెల్ నష్టాలకు సంబంధించి భారత ప్రభుత్వం నుండి ఎటువంటి అధికారిక సమాచారం రాలేదని, కానీ మూడు రాఫెల్‌లను కూల్చివేసినట్లు పాకిస్తాన్ చేసిన వాదన “తప్పు” అని ట్రాపియర్ స్పష్టం చేశారు. పారిస్ ఎయిర్ షోకు ముందు మాట్లాడిన ట్రాపియర్ “భారతీయులు కమ్యూనికేట్ చేయలేదు, కాబట్టి ఏమి జరిగిందో మాకు కచ్చితంగా తెలియదు. పాకిస్తాన్‌ చెబుతున్నది తప్పు అని మాకు ఇప్పటికే తెలుసు” అని అన్నారు. ఆధునిక యుద్ధాల్లో జెట్‌లకు నష్టం కలిగిందా అని కాకుండా.. తమ మిషన్‌ లక్ష్యం చేరుకుందా లేదా అని ఆలోచించాలని అన్నారు.

F-35 కంటే రాఫెల్ మెరుగైనదా?

ఇతర యుద్ధ విమానాలతో పోలిస్తే రాఫెల్ పనితీరు గురించి అడిగినప్పుడు, ట్రాపియర్ రాఫెల్ “ప్రపంచంలోనే అత్యుత్తమ విమానం” అని అన్నారు. ఇది F-35 కంటే మెరుగైనదని, ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని చైనా విమానాలను గణనీయంగా అధిగమిస్తుందని పేర్కొన్నారు. F-22 (US ఎయిర్ ఫోర్స్ ఎయిర్ సుపీరియారిటీ స్టెల్త్ ఫైటర్, ఎడిటర్ నోట్) తో వైమానిక ఘర్షణలో, రాఫెల్‌కు ఇది సంక్లిష్టంగా ఉంటుందని స్పష్టంగా తెలుస్తుంది. కానీ మీరు ఎయిర్-టు-ఎయిర్ మిషన్లు, నిఘా, ఎయిర్-టు-గ్రౌండ్ దాడులు, అణు మిషన్లు, విమాన వాహక నౌకను ప్రారంభించడానికి సామర్థ్యం ఉన్న ఒకే విమానం కోరుకుంటే, రాఫెల్ నిజంగా ప్రపంచంలోనే అత్యుత్తమ విమానం అని అన్నారు. ఇది ఫ్రెంచ్ సాయుధ దళాలు, వాటిని కొనుగోలు చేసిన దేశాల అవసరాలను సంపూర్ణంగా తీరుస్తుందని ట్రాపియర్‌ తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్
ఫ్యాక్షన్‌కు గుడ్‌బై.. కొత్త కథల రాజధానిగా మారుతున్న రాయలసీమ!
ఫ్యాక్షన్‌కు గుడ్‌బై.. కొత్త కథల రాజధానిగా మారుతున్న రాయలసీమ!