Tollywood : పెళ్లి కాకుండా కలిసి ఉంటున్నామని చాలా టార్చర్ చేశారు.. కావాలని మా అమ్మకు కాల్ చేసి.. టాలీవుడ్ నటి..
సాధారణంగా సినీ నటీనటుల మధ్య, ప్రేమ, పెళ్లి గురించి చెప్పక్కర్లేదు. చాలా మంది తారల డేటింగ్ విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. అయితే పెళ్లి కాకుండానే తాము కలిసి ఉంటున్నామని కొందరు తమను ఎంతో టార్చర్ చేశారని.. ఎన్నో మాటలు అన్నారని ఆవేదన వ్యక్తం చేసింది టాలీవుడ్ నటి. ఇప్పుడిప్పుడే ఇండ్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా మంచి పేరు తెచ్చుకుంది సోనియా సింగ్. సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష చిత్రంలో కీలకపాత్రలో నటించింది. అయితే బుల్లితెరపై సీరియల్స్, షోల ద్వారా ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సోనియా సింగ్ మాట్లాడుతూ.. పవన్ సిద్దుతో తన సహజీవనంపై, దాని వల్ల ఎదురైన సామాజిక విమర్శలు, వ్యక్తిగత సవాళ్ల గురించి పంచుకున్నారు. పెళ్లి కాకుండా కలిసి ఉండటంపై తన తల్లికి సమాజం నుండి ఎదురైన ప్రశ్నలు, దాని వల్ల తమ కుటుంబంలో ఏర్పడిన ఒత్తిడి గురించి ఆమె వివరించారు. సోనియా సింగ్ తన తల్లి ఆందోళనలకు సమాజం నుండే అసలు మూలం అని, తల్లి ఆలోచనలలో ఆందోళనలను సమాజమే ఇంజెక్ట్ చేసిందని తెలిపారు. సమాజంలో ఉన్న తీర్పులు, వెనుకబాటుతనం, ట్రస్ట్ బ్రేకింగ్ వంటి వాటిని ఎదుర్కోవడం కష్టమని సోనియా సింగ్ పేర్కొన్నారు. కొన్ని కోట్ల మంది ప్రజల ఆలోచనలను మార్చడం అసాధ్యమని ఆమె నిస్సహాయత వ్యక్తం చేశారు. అలాంటి వాటిని మార్చడం వల్ల బ్రేకింగ్ అవుతుందని, అది ముందుకు వెళ్లడానికి ఉపయోగపడుతుందని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..
సిద్దుతో పెళ్లి కాకుండానే కలిసి ఉండడం వల్ల తన తల్లిని తీవ్రంగా వేధించారని గుర్తు చేసుకుంది. పెళ్లి కాకుండానే కలిసి ఉంటున్నారు అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని.. దీంతో తన తల్లి చాలా ఆందోళన చెందేదని తెలిపింది. ఏదైనా కారణంతో తామిద్దరం విడిపోతే పరిస్తితి ఎలా ఉంటుంది.. సమాజం ఏమంటుంది అనే భయం తన తల్లికి ఎప్పుడూ ఉండేదని భావోద్వేగంగా చెప్పుకొచ్చింది. సిద్దు పక్కన ఉన్నప్పుడు తాను ఒక చైల్డిష్ మోడ్‌లోకి వెళతానని, అప్పుడు తాను చాలా సరదాగా, ఏమీ పట్టించుకోనని సోనియా సింగ్ వెల్లడించారు. తాను ఒక ఓపెన్ బుక్ లాగా ఉంటానని, కంఫర్ట్ జోన్‌లో ఉన్నప్పుడు తాను ఎంతో సౌకర్యంగా భావిస్తానని చెప్పారు. తనను చాలా ట్రోల్ చేసినట్లు ఆమె గుర్తించారు. తాను ఎక్స్‌ట్రీమ్ కంఫర్ట్ జోన్‌లో ఉండటం వల్ల తనను తాను మొదటిసారి అలా చూపించుకున్నానని, ఆ రోజును తాను బాగా ఎంజాయ్ చేశానని తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..
తన కెరీర్ ప్రయాణంలో ఎదురైన అడ్డంకులు, సవాళ్ల గురించి కూడా సోనియా సింగ్ పంచుకున్నారు. చాలా మందికి సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తే సినిమాలలో అవకాశాలు రావనే ఒక బౌండరీ ఉందని, సీరియల్ చేస్తే సినిమాలలోకి వెళ్లడం కష్టమని నమ్ముతారని ఆమె చెప్పారు. అయితే, తాను ఆ హద్దులను ఎలా బద్దలు కొట్టానో తనకు తెలియదని అన్నారు. యమలీల సీరియల్ చేస్తున్నప్పుడు ఊరిలో ఒక మేకపిల్లను పట్టుకొని ఫోటో తీసుకున్నానని, ఆ ఫోటోను చూసిన దర్శకుడు తనను పిలిచి, ఆ పాత్రకు ఎంపిక చేశారని వివరించారు. రూట్స్ ఎక్కడ నుండి వస్తాయో, ఎలా తిరుగుతాయో తెలియదని, సీరియల్ చేస్తున్నా కూడా ఆ సీరియల్‌లో ఫోటో చూసి సినిమా అవకాశం వచ్చిందని ఆమె ఉదాహరించారు. లుక్ టెస్ట్ తర్వాత ఆ పాత్రకు తాను ఖరారయ్యానని, ఆ తర్వాత తాను సినిమాలు చేశానని, సీరియల్స్‌ను కొంతకాలం ఆపేశానని తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..
సోనియా సింగ్, సిద్దు..
View this post on Instagram
ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..
