మీ ఆరోగ్యాన్ని కాపాడే వంటింటి వైద్యుడు.. ఇలా తింటే డబుల్ బెనిఫిట్
14 July 2026
TV9 Telugu
TV9 Telugu
ఉల్లి వేస్తే వంటకాలకు చక్కని రుచి, వాసన వస్తాయి. ఉల్లిపాయలను పచ్చిగా కూడా తింటుంటారు. అయితే ఆయుర్వేద ప్రకారం ఉల్లిపాయల్లో అనేక పోషకాలు ఉంటాయి
TV9 Telugu
అందువల్ల వీటిని రోజూ పచ్చిగా తింటే అనేక ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఉల్లిని ఉపయోగించడం వల్ల కొన్ని రకాల వ్యాధులను కూడా నయం చేసుకోవచ్చు
TV9 Telugu
హైబీపీని తగ్గించడంలో ఉల్లి అద్భుతంగా పనిచేస్తుంది. అందుకు గాను ఉల్లిపాయ రసం, తేనెలను ఒక టీస్పూన్ చొప్పున తీసుకుని కలిపి రోజూ ఉదయం, సాయంత్రం సేవించాలి
TV9 Telugu
ఇలా చేస్తే రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి మేలు జరుగుతుంది. భోజనంలో భాగంగా పచ్చి ఉల్లిపాయను 30 గ్రాములు తింటుండాలి
TV9 Telugu
దీంతో జీర్ణ సమస్యలు ఉండవు. ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. ఉల్లిపాయలు, కీరదోస, టమాటాలు, క్యారెట్, కొత్తిమీరలను తీసుకుని కట్ చేసి మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి
TV9 Telugu
అందులో నిమ్మరసం పిండి రోజుకు ఒక్కపూట తీసుకోవాలి. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధులకు దగ్గు, జలుబుకు చెక్ పెట్టవచ్చు
TV9 Telugu
ఉల్లిపాయల రసం 2 టీస్పూన్లు, తేనె 2 టీస్పూన్లు, అల్లం రసం 1 టీస్పూన్ మోతాదులో తీసుకుని బాగా కలిపి భోజనం తరువాత రోజూ తీసుకోవాలి
TV9 Telugu
ఇలా రోజూ రాత్రి పూట తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల శ్వాసకోశ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. దగ్గు, జలుబు, ఆయాసం నుంచి ఉపశమనం లభిస్తుంది