తొక్కతీసిన వెళ్లుల్లి ఫ్రిజ్‌లో పెట్టొచ్చా లేదా?

15 July 2026

Anand T

భారతీయ వంటకాల్లో, ముఖ్యంగా నాన్-వెజ్ వంటల్లో పచ్చి వాసన పోగొట్టి, రుచి, సువాసనలను పెంచడానికి వెల్లుల్లి చాలా అవసరం.

వంటల్లో ప్రాధాన్యత

అయితే వంటచేసేప్పుడు వెళ్లుల్లని ప్రతిసారి వొలిచే బదులు ఒకేసారి ఒల్లుదామని చాలా మంది వాటి పొట్టు తీసి ప్రిజ్‌లో స్లోర్ చేసుకుంటారు.

వొలిచి పెట్టడం

అయితే వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టు గాలి, తేమ, బాహ్య బ్యాక్టీరియాల నుండి దానికి సహజమైన రక్షణ కల్పిస్తుంది.

రక్షణ కవచం

కానీ మీరు దానికి రక్షణగా ఉన్న పొట్టు తీసేయడం వల్ల వెల్లుల్లి లోపలి భాగం గాలికి గురై అది సహజ సమ్మేళనాలను కోల్పోయే ప్రమాదం ఉంది.

పొల్లు తీస్తే

సాధారణంగా వెల్లుల్లికి ప్రత్యేకమైన ఘాటు, సువాసన, ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే అల్లిసిన్ అనే సమ్మేళనం, దానిని కట్ చేసినప్పుడు లేదా పేస్ట్ చేసినప్పుడు విడుదలవుతుంది.

అల్లిసిన్ సమ్మేళనం

మీరు పొట్టు తీసిన వెల్లుల్లిని సరిగ్గా మూసి ఉంచకపోతే, అది తేమను పీల్చుకుని రంగు మారి తన అసలు సువాసనను కోల్పోతుంది.

తేమతో ప్రమాదం

వెల్లుల్లిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలనుకుంటే, తడి లేకుండా పూర్తిగా ఎండిన శుభ్రమైన, గాలి చొరబడని డబ్బాలో ఉంచాలి. లేదంటే చాలా కాలం పాటు అలాగే వదిలేస్తే వెల్లుల్లికి బూజు పట్టి పూర్తిగా పాడైపోయే ప్రమాదం ఉంది.

ఎయిర్-టైట్ కంటైనర్

కాబట్టి పోషకాలు, తాజాతనం తగ్గకుండా ఉండాలంటే ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా, ఎప్పికప్పుడు ప్రెష్‌గా పొట్టు వొల్చుకొని వాడుకోండి.

పరిమితంగా వలవండి