Hurricane Ian: క్యూబాను కుదిపేసిన హరికేన్‌ ఇయాన్‌.. భారీగా పంట నష్టం.. అంధకారంలో మగ్గుతున్న ప్రజలు

|

Sep 29, 2022 | 9:55 AM

భారీ వర్షాల కారణంగా వరద నీరు రోడ్లను ముంచెత్తడంతోపాటు ఇళ్లలోకి ప్రవేశించడంతో క్యూబా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇయాన్‌ తుఫాను ధాటికి క్యూబాలోని పవర్‌ గ్రిడ్‌ దెబ్బతినడంతో దాదాపు కోటీ 20 లక్షల మంది ప్రజలు అంధకారంలో మునిగిపోయారు.

Hurricane Ian: క్యూబాను కుదిపేసిన హరికేన్‌ ఇయాన్‌.. భారీగా పంట నష్టం.. అంధకారంలో మగ్గుతున్న ప్రజలు
Cuba,hurricane Ian
Follow us on

అమెరికా దిగువన ఉన్న కరీబియన్‌ ద్వీప దేశం క్యూబాలో ఇయాన్‌ తుఫాను భారీ విధ్వంసాన్ని సృష్టించింది. గంటకు 200 కిలోమీటర్ల వీచిన రాకాసి గాలులతో క్యూబా వణికిపోయింది. తీర ప్రాంతంలో వృక్షాలు ఒరిగిపోయాయి. రోడ్లకు అడ్డంగా చెట్టు పడిపోయాయి. రాజధాని హవానాతో పాటు పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. పినార్‌ డెల్‌ రియో ప్రాంతంపై ఎక్కువ ప్రభావం చూపింది. భారీ వర్షాల కారణంగా వరద నీరు రోడ్లను ముంచెత్తడంతోపాటు ఇళ్లలోకి ప్రవేశించడంతో క్యూబా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇయాన్‌ తుఫాను ధాటికి క్యూబాలోని పవర్‌ గ్రిడ్‌ దెబ్బతినడంతో దాదాపు కోటీ 20 లక్షల మంది ప్రజలు అంధకారంలో మునిగిపోయారు. విద్యుత్ సరఫరాను ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. క్యూబా ఆర్థిక వ్యవస్థకు మూలమైన పొగాకు పంట చాలా మేరకు దెబ్బతిన్నంది. అధికారులు ముందు జాగ్రత్తగా దాదాపు 25 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ప్రాణ నష్టం తప్పింది.

కాగా క్యూబాను తీవ్రంగా దెబ్బతీసిన ఇయాన్‌ తూఫాను అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రాన్ని తాకింది. అక్కడ గంటకు 209 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. తుఫాను ప్రభావంతో మియామీ సహా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఇక ఆసియాలో ఫిలిప్పీన్స్‌ను వణికించిన నోరు తుఫాను వియత్నాంను తాకింది. ప్రముఖ బీచ్ రిసార్ట్ నగరం డా నాంగ్ సమీపంలో తీరం దాటింది. 175 కిలో మీటర్ల వేగంతో వీచిన గాలులకు పెద్ద సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడ్డాయి. అధికారులు ముందు జాగ్రత్తగా నాలుగు లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇందులో విదేశీ పర్యాటకులు కూడా ఉన్నారు. అధికారులు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..