Viral News: రాతితో చేసిన మొసలి అనుకుని.. దానిపై చేయివేసి ఓ వృద్ధుడు సెల్ఫీకి యత్నం.. మరణం అంచువరకూ వెళ్లి వచ్చిన వైనం..

Viral News:  స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత వయసుతో సంబంధం లేకుండా సెల్ఫీలు తీసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. కదులుతున్న రైళ్లు, బస్సులు, కొండకోనల్లో.. నదుల్లో..

Viral News: రాతితో చేసిన మొసలి అనుకుని.. దానిపై చేయివేసి ఓ వృద్ధుడు సెల్ఫీకి యత్నం.. మరణం అంచువరకూ వెళ్లి వచ్చిన వైనం..
Crocodile
Follow us
Surya Kala

|

Updated on: Nov 27, 2021 | 9:10 PM

Viral News:  స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత వయసుతో సంబంధం లేకుండా సెల్ఫీలు తీసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. కదులుతున్న రైళ్లు, బస్సులు, కొండకోనల్లో.. నదుల్లో ఇలా ఎక్కడైనా సెల్ఫీలు తీసుకోవడానికి ఒకే అంటున్నారు. ప్రమాదకరమైన పరిస్థితులను కూడా లెక్కచేయకుండా..సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ.. కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటుంటే.. మరికొందరు వికలాంగులుగా మారుతున్న ఘటనలు గురించిఅనేకం వింటూనే ఉన్నాం.. చిన్నవాళ్ళకి సుద్దులు చెప్పాల్సిన ఓ వ్యక్తి.. సెల్ఫీ మోజుతో చేసిన పనికి మరణం అంచులవరకూ వెళ్లి వచ్చాడు. ఈ దారుణ ఘటన ఫిలిప్పీన్స్‌లో చోటు చేసుకుంది. వినోద ఉద్యానవనానికి సందర్శకుల సరదా యాత్రఇప్పుడు భయంకరంగా మారింది. ఇప్పుడు ఆ మొసలి దాడికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో హల్ చల్ చేస్తోంది. అంతేకాదు పార్క్ వద్ద భద్రతా చర్యలు , ప్రోటోకాల్‌ల గురించి పెద్ద చర్చకు దారితీసింది.వివరాల్లోకి వెళ్తే..

సహా కాగయన్ డి ఓరో సిటీలోని అమయా వ్యూ అమ్యూజ్‌మెంట్ పార్క్‌ కు నెహెమియాస్ చిపాడా (60) అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి వెళ్ళాడు. అక్కడ ఒక కొలను ఉంది. ఆ కొలనులో కనిపించిన మొసలి.. చూడడానికి సిమెంట్ తో చేసిందిలా ఉంది. దీంతో నెహెమియాస్ చిపాడా మొసలితో సెల్ఫీ తీసుకోవగం కోసం థీమ్‌ పార్క్‌లోని కొలనులోనికి దిగాడు. సెల్ ఫోన్ ను ఒక చేత్తో పట్టుకుని మరో చేతిని విశ్రాంతి తీసుకుంటున్న 12 అడుగుల మొసలిపై వేసి సెల్ఫీ తీసుకునేందుకు యత్నించాడు. వెంటనే ఆ మొసలి చిపాడా పై దాడి చేసింది. ఎడమచేయి పట్టుకుని తినడానికి ప్రయత్నించింది. అయితే చిపాడ కష్టపడి తన చెయ్యిని మొసలి నోటి నుంచి విడిపించుకుని బయటపడ్డాడు. వెంటనే చిపాడా కుటుంబ సభ్యులు  ఆస్పత్రికి తరలించారు. వెంటనే వైద్యులు అతని చేతికి ఆపరేషన్ చేశారు. ప్రాణాపాయం లేదని చెప్పారు.

అయితే అక్కడ కొలను దగ్గర మొసళ్ళు ఉన్నట్లు  హెచ్చరిస్తూ ఎటువంటి  బోర్డులు లేవని పార్క్‌ నిర్వాహకులపై ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను అవాస్తమంటూ  అమయా వ్యూ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కాండీ ఉనాబియా ఖండించారు.  తాము తమ పార్క్‌ టూర్ గైడ్‌లో ముందుగానే ఆ ప్రాంతాన్ని పరిమితులకు లోబడే సందర్శించాలనే విషయాలను పర్యాటకులకు ముందుగానే చెబుతామన్నారు. అయితే.. చిపాడా పూర్తిగా కోలుకునే వరకు అతని వైద్య బిల్లులన్నింటినీ తామే భరిస్తామిని.. అతను త్వరగా కోలుకోవాలని మేము ఆశిస్తున్నామన్నారు.

Also Read:  అగ్రరాజ్యంలో కొనసాగుతున్న కరోనా కల్లోలం.. న్యూయార్క్‌లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం..