AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

COVID-19 Rules: రెస్టారెంట్లో భౌతిక దూరం పాటించకుండా టేబుల్ పై దగ్గర దగ్గరగా మనుషులు..పోలీసులకు ఫిర్యాదు.. తీరా పోలీసులు వచ్చాకా..

కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడం చట్టరీత్యా నేరం. చాలా దేశాల్లో దీనిని కచ్చితంగా అమలు చేయడానికి కఠినంగానే వ్యవహరిస్తాయి.

COVID-19 Rules: రెస్టారెంట్లో భౌతిక దూరం పాటించకుండా టేబుల్ పై దగ్గర దగ్గరగా మనుషులు..పోలీసులకు ఫిర్యాదు.. తీరా పోలీసులు వచ్చాకా..
Covid 19 Rules
KVD Varma
|

Updated on: May 02, 2021 | 11:01 PM

Share

COVID-19 Rules: కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడం చట్టరీత్యా నేరం. చాలా దేశాల్లో దీనిని కచ్చితంగా అమలు చేయడానికి కఠినంగానే వ్యవహరిస్తాయి. ఈ నేపధ్యంలో చాలా దేశాల్లో ప్రజలు కూడా కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా పాల్పడినట్టు కనిపిస్తే, వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తారు. మాకెందుకులే అని వదిలేయరు. అలాగే, పోలీసులు కూడా ఇటువంటి కాల్స్ ని నిర్లక్ష్యం చేయరు. వెంటనే అక్కడికి వెళ్లి సదరు నిబంధనలు అత్కిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటారు. ఒక్కోసారి ఇటువంటి సంఘటనలు పోలీసులకు ఇబ్బందులూ సృష్టిస్తుంటాయి. హడావుడిగా పరిగెత్తి వెళ్ళాకా అక్కడ అటువంటిది ఏమీ లేదని తేలితే పోలీసుల ప్రాణం ఉసూరుమంటుంది. ఇదిగో, ఇక్కడ మీకు అటువంటిదే ఒక స్టోరీ.

కెనడాలోని హాలేఫాక్స్ లో ఓ రెస్టారెంట్ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తోందని పోలీసులకు ఫోన్ వెళ్ళింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగిపోయారు. ఆ ప్రదేశానికి వెళ్ళాకా.. అయ్యో అనుకున్నారు. ఎందుకంటే, అక్కడ అ రెస్టారెంట్ ఏమాత్రం కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించలేదు. పోలీసులు రెస్టారెంట్ వాళ్ళపై చర్యతీసుకోకుండా వెళ్లిపోతుంటే, ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి వచ్చి ఎందుకు అలా వదిలేశారు అని అడిగారు. దానికి ఆ పోలీసులు అక్కడ నిబంధనల ఉల్లంఘన ఏమీ జరగలేదు అని చెప్పారు. దీంతో ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తీ అక్కడ సోషల్ డిస్టెన్స్ పాటించకుండా టేబుల్ వద్ద దగ్గర దగ్గరగా కూచున్నారు. చూడండి అన్నారు.

దీంతో ఆ రెస్టారెంట్ ఓనర్ వచ్చి అసలు విషయం ఆ ఫిర్యాదు దారుకు చెప్పారు. అయ్యా.. అవి బొమ్మలు. టేబుల్ వద్ద సోషల్ డిస్టెన్స్ కోసం అందంగా ఉంటాయని కొన్ని చైర్స్ లో బొమ్మలు పెట్టాము. ఆ చైర్స్ లో ఎవరూ కూచోకుండా. మీకు దూరం నుంచి అవి మనుషుల్లా కనిపించాయి అని చెప్పాడు. దాంతో ఆశ్చర్యపోవడం ఆ ఫిర్యాదు చేసినాయన పని అయింది.

Also Read: ఈ సరస్సు నీటిని తాకితే రాయిగా మారిపోతారు..! అవును మీరు విన్నది నిజమే..? ఇది ఎక్కడ ఉందో తెలుసా..

America Military: అఫ్ఘనిస్తాన్ నుంచి నాటో దళాల ఉపసంహరణ షురూ.. సెప్టెంబర్ 11 డెడ్‌లైన్