AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Games: వీడియో గేమ్‌ పిచ్చిలో బాలుడు.. పక్క గదిలో విగత జీవులుగా పేరెంట్స్‌

వీడియో గేమ్స్ పిచ్చి పీక్స్ కి చేరుతోంది. పక్కనున్న వారు ఏమైపోతున్నా పట్టించుకోకుండా ఫోన్స్ లో మునిగితేలుతున్నారు. తాజాగా జరిగిన ఓ ఘటన గేమ్స్ పిచ్చి ఏ రేంజ్ కు చేరిందో చెప్పడానికి సాక్ష్యంగా నిలుస్తోంది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

Games: వీడియో గేమ్‌ పిచ్చిలో బాలుడు.. పక్క గదిలో విగత జీవులుగా పేరెంట్స్‌
Video Game
Narender Vaitla
|

Updated on: Nov 11, 2024 | 10:12 AM

Share

గ్యాడ్జెట్స్‌ పిచ్చి ఎంతలా పెరిగిందంటే.. పక్కనున్న వారిని కూడా కనీసం పట్టించుకోని స్థాయికి చేరుకున్నారు. గంటలతరబడి ఫోన్‌లతో కుస్తీలు పడుతున్నారు. పక్కనున్న ఏమైపోయినా ఫోన్‌లోనే మునిగితేలుతున్నారు. రీల్స్, ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఇలా రకరకాల అలవాట్లకు బానిసలుగా మారుతున్నారు. తాజాగా అమెరికాలో జరిగిన ఓ సంఘటన గేమ్స్‌ పిచ్చి ఏ రేంజ్‌కు చేరిందో చెబుతోంది.

వివరాల్లోకి వెళితే.. అమెరికా వాషింగ్టన్‌లోని లాంగ్‌వ్యూలోని ఇంట్లో భార్యభర్తలిద్దరు ఏదో కుటుంబ కారణంతో గొడవపడ్డారు. అయితే ఆ గొడవ కాస్త చినికి చినికి గాలి వానగా మారింది. ఎంతలా అంటే ఒకరినొకరు భౌతిక దాడి చేసుకునేంతలా. అయితే ఇంత గొడవ జరుగుతున్నా పక్క గదిలో ఉన్న 11 ఏళ్ల వారి కుమారుడికి మాత్రం తెలియలేదు. కారణం వీడియో గేమ్‌ ఆడుతూ ఆ విసయాన్ని పట్టించుకోలేదు.

హాలోవీన్‌ వేడుకల సందర్భంగా గత నెల 31వ తేదీన వాషింగ్టన్‌లోని లాంగ్‌వ్యూలో ఈ ఘటన చేసుకుంది. అయితే చివరకు ఆ గొడవ పీక్స్‌కి చేరి భార్యభర్తలిద్దరూ ఒకరినొకరు చంపుకున్నారు. చివరికి రక్తపు మడుగులో ఉన్న తల్లిదండ్రులను చూసిన బాలుడు 911కి ఎమర్జెన్సీ కాల్‌ చేసి విషయాన్ని పోలీసులకు తెలిపాడు. దీంతో పోలసులు రంగంలోకి దిగారు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాల సమీపంలో కత్తితో పాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాల కారణంగానే దంపతులిద్దరూ గొడవకు దిగి ఒకరినొకరు దాడి చేసుకొని ఉండొచ్చని భావిస్తున్నారు. మృతి చెందిన భార్యాభర్తలను జువాన్‌ ఆంటోనియో అల్వరాడో(38), సిసిలియా రోబుల్స్‌(39)గా గుర్తించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..