AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా వైరస్.. ఇండియాలో అలర్ట్.. ప్రయాణికులకు ముమ్మరంగా స్క్రీనింగ్

చైనాను కబళిస్తున్న కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో క్రమేపీ తన ప్రతాపాన్ని చూపుతోంది. చైనాలో ఇప్పటికే ఈ వైరస్ వ్యాధి సోకి మరణించినవారి సంఖ్య 80 కి పెరగగా.. సుమారు రెండున్నరవేల మంది దీని ప్రభావానికి  గురయ్యారు. కాగా.. ఇండియాలో వైద్య,ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమయింది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలూ తీసుకుంటున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ తెలిపారు. ఇప్పటివరకు మన దేశంలో ఈ వ్యాధికి […]

కరోనా వైరస్.. ఇండియాలో అలర్ట్.. ప్రయాణికులకు ముమ్మరంగా  స్క్రీనింగ్
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 27, 2020 | 3:26 PM

Share

చైనాను కబళిస్తున్న కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో క్రమేపీ తన ప్రతాపాన్ని చూపుతోంది. చైనాలో ఇప్పటికే ఈ వైరస్ వ్యాధి సోకి మరణించినవారి సంఖ్య 80 కి పెరగగా.. సుమారు రెండున్నరవేల మంది దీని ప్రభావానికి  గురయ్యారు. కాగా.. ఇండియాలో వైద్య,ఆరోగ్య మంత్రిత్వ శాఖ అప్రమత్తమయింది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలూ తీసుకుంటున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ తెలిపారు. ఇప్పటివరకు మన దేశంలో ఈ వ్యాధికి సంబంధించి ఎలాంటి పాజిటివ్ కేసు కూడా కనబడలేదన్నారు. చైనా నుంచి వచ్చిన ఏడుగురు ప్రయాణికుల రక్త నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌కు పంపినట్టు ఆయన చెప్పారు. అలాగే ఇరవై నాలుగు గంటలూ ఓ కాల్ సెంటర్ పని చేస్తోందన్నారు.  ఈ నెల 1 నుంచి చైనాకు వెళ్లి ఇండియాకు తిరిగి వచ్చిన ప్రయాణికుల్లో ఎవరైనా జ్వరం, దగ్గు, శ్వాస సంబంధ రుగ్మతలతో బాధ పడుతుంటే వెంటనే దగ్గరలోని ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని హర్ష వర్ధన్ కోరారు. ఇక ఢిల్లీ సహా ముంబై, బెంగుళూరు, హైదరాబాద్, కొచ్చి , కోల్ కతా, చెన్నై విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాట్లు చేశారు.

ఇలా ఉండగా కేరళ, మహారాష్ట్రలో సుమారు రెండు వందల మందిని ముందు జాగ్రత్త చర్యగా ]అబ్జర్వేషన్ లో ఉంచారు. కేరళలో 172 మందిని హోం నిఘాలో ఉంచగా.. ఏడుగురిని వివిధ ఆసుపత్రులకు తరలించారు. చైనా నుంచి పాట్నా చేరిన ఒక అమ్మాయిని, అలాగే ఆ దేశం నుంచి రాజస్తాన్ కు వఛ్చిన ఓ డాక్టర్ ను కూడా ఎందుకైనా మంచిదని ఆసుపత్రికి తరలించారు.

ఢిల్లీలో ప్రధాని మోదీకి  ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన పి.కె. మిశ్రా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆరోగ్య శాఖ అధికారులు.. ఈ వైరస్ వ్యాప్తి నిరోధక చర్యలను వివరించారు. మరోవైపు.. చైనాలోని వూహాన్ సిటీ నుంచి భారతీయులను తరలించేందుకు ఎయిరిండియా బోయింగ్ 747 విమానాన్ని సిధ్ధంగా ఉంచింది. ప్రభుత్వ నిర్ణయం కోసం తాము ఎదురుచూస్తున్నట్టు వైమానిక దళ అధికారి ఒకరు తెలిపారు.

'నారీ నారీ నడుమ మురారి' రివ్యూ.. శర్వానంద్ హిట్ కొట్టాడా?
'నారీ నారీ నడుమ మురారి' రివ్యూ.. శర్వానంద్ హిట్ కొట్టాడా?
కట్టెలు, కర్రలు లేకుండా.. పర్యావరణ హిత భోగీ.. ఎలా చేశారో తెలుసా..
కట్టెలు, కర్రలు లేకుండా.. పర్యావరణ హిత భోగీ.. ఎలా చేశారో తెలుసా..
రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు
రైల్వే ట్రాక్‌పై మహిళకు ప్రసవం.. మానవత్వం చాటిన తోటి ప్రయాణికులు
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు
గ్రీన్ టీ ఏ సమయంలో తాగాలి..? తిన్నాక లేదంటే తినకముందా..? ఎప్పుడు
కోడిపందేల బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించేనా?
కోడిపందేల బిజినెస్ కొత్త రికార్డులు సృష్టించేనా?
చికెన్, మటన్ ముక్కల్ని ఈజీగా కోసేస్తున్న మాంజా దారం
చికెన్, మటన్ ముక్కల్ని ఈజీగా కోసేస్తున్న మాంజా దారం
ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి.. మీ ఆరోగ్యానికి దిక్సూచి..!
ముల్లంగి చూసి మూతి తిప్పేసుకోకండి.. మీ ఆరోగ్యానికి దిక్సూచి..!
ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన
ఇది కదా రేసంటే.. లైన్‌ దాటితే అంతే.. ట్రాక్టర్లతో అద్భుత ప్రదర్శన
హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ?
హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ?
పిచ్చిమొక్క అని పీకేస్తే మీకే లాస్‌.. పాడైపోయిన శరీర అవయవాలకు
పిచ్చిమొక్క అని పీకేస్తే మీకే లాస్‌.. పాడైపోయిన శరీర అవయవాలకు