ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మందికి కరోనా…
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని దేశాల్లో అయితే సెకండ్ వేవ్ కూడా మొదలైంది. మునపటి కంటే ఈసారి..
Corona Cases In World: ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని దేశాల్లో అయితే సెకండ్ వేవ్ కూడా మొదలైంది. మునపటి కంటే ఈసారి రోజూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిన్న ఒక్క రోజు 5,98,153 పాజిటివ్ కేసులు, 7,445 మరణాలు సంభవించాయి. కాగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 50,369,940కి చేరింది. అలాగే ఇప్పటివరకూ వరల్డ్ వైడ్‌గా 1,257,957 మంది కరోనాతో మరణించారు. ఇక 35,616,981 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ఇక అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో ప్రతీ రోజూ లక్ష కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 10,185,012కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 243,269 మంది మృతి చెందారు. ఇక బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, స్పెయిన్, అర్జంటినా, యూకేలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. అటు ఇండియాలో ఇప్పటివరకు 8,507,754 కేసులు నమోదు కాగా.. 126,162 మంది వైరస్ కారణంగా మరణించారు. ఇక యూరోప్‌లో కూడా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.
Also Read:
ఆంజనేయుడి జన్మస్థలం ఎక్కడ.? పరిశోధనకు ఆదేశించిన టీటీడీ.!
జగన్ సంచలన నిర్ణయం.. వారికి 10 రోజుల పాటు రోజుకో పధకం..
ఆ క్యాచ్ మిస్ కాకుంటే.. కథ వేరేలా ఉండేదిః కోహ్లీ
అక్కడ డిసెంబర్ 31 వరకు స్కూల్స్ మూసివేత..
మళ్లీ స్లెడ్జింగ్ చేసిన కోహ్లీ.. ఈసారి రిప్లై అదుర్స్.!
ఆ పాస్టర్లపై చర్యలు తీసుకోండి.. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశం