అమెరికా అధ్యక్షుడిగా బైడెన్.. ‘ఆర్చర్ బాబా’ ఎప్పుడో చెప్పేశాడుగా
ఇంగ్లండ్ క్రికెటర్ జోఫ్రా ఆర్చర్ భవిష్యత్‌ని ముందే ఊహించగలడు. ఈ విషయం ఒక్కసారి, రెండుసార్లు కాదు చాలా సార్లే తేలింది
Jofra Archer old tweet: ఇంగ్లండ్ క్రికెటర్ జోఫ్రా ఆర్చర్ భవిష్యత్‌ని ముందే ఊహించగలడు. ఈ విషయం ఒక్కసారి, రెండుసార్లు కాదు చాలా సార్లే తేలింది. పృథ్వీ షాపై వేటు, ఆర్టికల్ 370 రద్దు, లాక్‌డౌన్, ఐపీఎల్‌లోకి తన ఎంట్రీ, సెంచరీని మిస్ అయిన గేల్, ముంబయి పవర్‌కట్.. ఇలా పలు విషయాలను ముందే చెప్పాడు ఈ క్రికెటర్. ఇక తాజాగా అమెరికా ఎన్నికల్లో జో బైడెన్ ముందే గెలుస్తాడని ఊహించాడు ఈ క్రికెటర్. దీనికి సంబంధించి 2014 అక్టోబర్ 4నే ‘జో’ అంటూ ఓ ట్వీట్ చేశారు. ఇక ఇప్పుడు జో బైడెన్ గెలిచిన తరువాత ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. దీంతో ఆర్చర్ బాబా, నువ్వు దేవుడివి, జోఫ్రా ఆచర్చర్ బాబాకి జై అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
Read More:
నంద్యాల ఫ్యామిలీ ఆత్మహత్య కేసు: పోలీసుల వేధింపులే కారణమా..!
మాస్క్ విషయంలో నిర్లక్ష్యం.. ఏకంగా రూ.4.7కోట్లు వసూలు చేసిన బీఎంసీ
Joe!
— Jofra Archer (@JofraArcher) October 4, 2014