AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock: ఈ ఒక్క స్టాక్‌ ఉంటే ఉద్యోగంతో పన్లేదిక.. అప్పుడు రూ. 44.. ఇప్పుడు ఎంతో తెలిస్తే బిత్తరపోతారు

MRF షేర్‌ 34 ఏళ్లలో 2200 రెట్ల కంటే ఎక్కువ లాభం ఇచ్చిందని చెప్పొచ్చు. ఓ వ్యక్తి 1989లో రూ. 44కు ఈ షేర్ కొనగా.. ఇప్పుడు అది రూ. 1.30 లక్షలు దాటింది. ఇది దీర్ఘకాలిక పెట్టుబడికి ఓ ఎగ్జాంపుల్.

Stock: ఈ ఒక్క స్టాక్‌ ఉంటే ఉద్యోగంతో పన్లేదిక.. అప్పుడు రూ. 44.. ఇప్పుడు ఎంతో తెలిస్తే బిత్తరపోతారు
Mrf
Ravi Kiran
|

Updated on: Feb 13, 2026 | 5:17 PM

Share

ఎంఆర్ఎఫ్ షేర్.. భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక మైలురాయిని సృష్టించిందని చెప్పొచ్చు. రూ. లక్ష మార్క్ తాకిన మొదటి షేర్ ఇదే కావడం విశేషం. ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ షేర్ ద్వారా లాభాల బాట పట్టిన కుటుంబాలు చాలానే ఉన్నాయి. ఆ కోవకు చెందిన ఓ ఫ్యామిలీ గురించి ఇప్పుడు చూసేద్దాం. సిద్ధార్ద్ అనే వ్యక్తి ఒకరు ఎంఆర్ఎఫ్ షేర్లతో తనకున్న అనుభవాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. 1989లో ఎంఆర్ఎఫ్ షేర్‌ను కేవలం రూ. 44-45 మధ్య కొనుగోలు చేశానన్నారు. అప్పటి నుంచి 36 సంవత్సరాలుగా ఈ షేర్లను నిలకడగా రాణిస్తూ.. తనకు లాభాలు ఇస్తున్నాయని.. అలాగే ఈ షేర్ ఇప్పుడు రూ. 1.30 లక్షల కంటే ఎక్కువకు చేరుకుంది. అంటే.. ఆ వ్యక్తి పెట్టుబడి కంటే 2200 రెట్ల లాభం ఇచ్చిందని చెప్పొచ్చు.

దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఈ బ్లూ-చిప్ కంపెనీ అధిక రాబడిని ఇవ్వడమే కాదు.. డివిడెండ్ ఇచ్చి కూడా మంచి ప్రాఫిట్స్ అందిస్తోంది. ఈ కంపెనీ సంవత్సరాల తరబడి ఇస్తున్న డివిడెండ్‌లతో తన అసలు పెట్టుబడి ఎప్పుడో వచ్చేసిందని.. ప్రస్తుతం ఫ్రీగా ఆ షేర్లు తన దగ్గర ఉన్నట్లేనని చెప్పాడు. భవిష్యత్తులో కూడా కంపెనీ స్ప్లిట్ లేదా బోనస్ లాంటివి ప్రకటిస్తే.. తన లాభం మరింతగా పెరుగుతుందని చెప్పుకొచ్చాడు. దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు, స్టాక్ మార్కెట్‌పై ఉన్న భయాలు ఇలాంటి కంపెనీలు మారుస్తాయి. మరి మీరు కూడాస్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనుకుంటే.. కచ్చితంగా కంపెనీల స్థితిగతులను చూడటమే కాకుండా.. బిజినెస్ అడ్వైజర్‌ను కూడా సంప్రదించండి.

Follow Us
షవర్‌ నుంచి వాటర్ సరిగ్గా రావట్లేదా? ఇలా సింపుల్‌గా క్లీన్ చేయండి
షవర్‌ నుంచి వాటర్ సరిగ్గా రావట్లేదా? ఇలా సింపుల్‌గా క్లీన్ చేయండి
వచ్చే వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
వచ్చే వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
మన జీవితాన్ని నడిపిస్తున్నది మాయేనా? అసలు మాయ వెనుక ఉన్న..
మన జీవితాన్ని నడిపిస్తున్నది మాయేనా? అసలు మాయ వెనుక ఉన్న..
ఇదేవ్వరూ ఊహించలేదే.. బిగ్‌బాస్ తెలుగు 10లో టాలీవుడ్ స్టార్ విలన్
ఇదేవ్వరూ ఊహించలేదే.. బిగ్‌బాస్ తెలుగు 10లో టాలీవుడ్ స్టార్ విలన్
UPSC మాక్‌ ఇంటర్వ్యూలో ఊహించని ప్రశ్న.. ఆన్సర్‌ విని దెబ్బకు షాక్
UPSC మాక్‌ ఇంటర్వ్యూలో ఊహించని ప్రశ్న.. ఆన్సర్‌ విని దెబ్బకు షాక్
ఆగస్ట్ 28 నుంచి కొత్త క్రెడిట్ కార్డు రూల్స్.. బిల్లు కట్టకపోతే..
ఆగస్ట్ 28 నుంచి కొత్త క్రెడిట్ కార్డు రూల్స్.. బిల్లు కట్టకపోతే..
ఉద్యోగంలో గుర్తింపు, ఆర్థిక లాభాలు.. 12 రాశులకు వారఫలాలు
ఉద్యోగంలో గుర్తింపు, ఆర్థిక లాభాలు.. 12 రాశులకు వారఫలాలు
గంటల తరబడి పులియపెట్టే పనిలేదు ఇలా చేస్తే నిమిషాల్లో దోసెల పిండి
గంటల తరబడి పులియపెట్టే పనిలేదు ఇలా చేస్తే నిమిషాల్లో దోసెల పిండి
వినాయక చవితి ఎప్పుడు? చంద్రుడిని ఏ సమయంలో చూడకూడదో తెలుసా?
వినాయక చవితి ఎప్పుడు? చంద్రుడిని ఏ సమయంలో చూడకూడదో తెలుసా?
'పంజా' హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి? స్టన్ అవుతోన్న నెటిజన్లు
'పంజా' హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి? స్టన్ అవుతోన్న నెటిజన్లు