మాజీ అధ్యక్షుల పింఛన్‌ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

మాజీ అధ్యక్షుల పింఛన్‌ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

సస్పెన్స్‌కు తెరపడింది. అగ్రరాజ్యం అమెరికాకు 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికయ్యారు. ప్రస్తుత దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఓటమిని చవి చూశారు.

Ravi Kiran

|

Nov 08, 2020 | 11:59 PM

Ex-President’s Pensions: సస్పెన్స్‌కు తెరపడింది. అగ్రరాజ్యం అమెరికాకు 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికయ్యారు. ప్రస్తుత దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఓటమిని చవి చూశారు. ట్రంప్ ఓటమికి చాలా కారణాలే ఉన్నాయి. ముఖ్యంగా కరోనా కట్టడిలో ఘోర వైఫల్యం, జాతి వివక్ష వంటి అంశాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే పదవీకాలం ముగిసిన తర్వాత మాజీ అధ్యక్షులు ఎలా జీవిస్తారు.? వారికి ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రయోజనాలు చేకూరుతాయా.? అనే ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం..

దేశానికీ ఎంతగానో సేవలందించి పదవీకాలం ముగిసిన మాజీ అధ్యక్షులకు ప్రభుత్వం చాలానే ప్రయోజనాలు అందిస్తుంది. దీని కోసమే అమెరికా ప్రభుత్వం 1958లో ‘ఫార్మర్ ప్రెసిడెంట్ యాక్ట్’ను అమలులోకి తీసుకొచ్చింది. ఈ యాక్ట్ ప్రకారం మాజీ అధ్యక్షులకు ప్రభుత్వ పింఛన్‌, సిబ్బంది జీతభత్యాల భృతి, ఆరోగ్య బీమాతో పాటు రహస్య భద్రతను కల్పిస్తుంది.

మాజీ అధ్యక్షులకు ప్రతీ ఏటా రూ. 1.6 కోట్లు పింఛన్‌ కింద సెక్రటరీ ఆఫ్ ట్రెజరీ మంజూరు చేస్తుంది. అంతేకాదు మాజీ అధ్యక్షుడి జీవిత భాగస్వామికి కూడా ఏడాదికి 20 వేల డాలర్ల పింఛన్‌ అందజేస్తారు. అలాగే శ్వేతసౌధాన్ని విడిచిపెట్టిన తర్వాత మాజీ అధ్యక్షుడు సొంతంగా నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అయ్యే ఖర్చును కూడా అమెరికా ప్రభుత్వమే భరిస్తుంది. ఇంకా వారి వ్యక్తిగత ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతాలను సైతం ప్రభుత్వం జనరల్ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం నుంచి ఇప్పిస్తుంది. అలాగే మాజీ అధ్యక్షులకు ఆరోగ్య భీమాతో పాటు రహస్య భద్రతను కూడా ఏర్పాటు చేస్తుంది. ఏది ఏమైనా అధ్యక్ష పీఠం విడిచి వెళ్ళిపోయిన తర్వాత మాజీ అధ్యక్షుల జీవితం బిందాస్ అని చెప్పాలి.

Also Read:

ఆంజనేయుడి జన్మస్థలం ఎక్కడ.? పరిశోధనకు ఆదేశించిన టీటీడీ.!

జగన్ సంచలన నిర్ణయం.. వారికి 10 రోజుల పాటు రోజుకో పధకం..

ఆ క్యాచ్ మిస్ కాకుంటే.. కథ వేరేలా ఉండేదిః కోహ్లీ

అక్కడ డిసెంబర్ 31 వరకు స్కూల్స్ మూసివేత..

మళ్లీ స్లెడ్జింగ్ చేసిన కోహ్లీ.. ఈసారి రిప్లై అదుర్స్.!

ఆ పాస్టర్లపై చర్యలు తీసుకోండి.. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఆదేశం

బిగ్ బాస్ 4: హౌస్ నుంచి అమ్మ రాజశేఖర్ ఎలిమినేట్..!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu