హాంకాంగ్ నిరసనకారులకు ఎలక్ట్రిక్ షాక్‌లు.. చైనా సైనికుల వ్యూహం

హాంకాంగ్ లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న ఆందోళనకారులను అదుపు చేసేందుకు చైనా సైనికులు అమానుష పధ్ధతులకు పాల్పడబోతున్నారు. ప్రొటెస్టర్లకు విద్యుత్ షాక్ లు ఇచ్ఛే 8 అడుగుల పొడవైన భారీ ఫోర్క్ లను వాడేందుకు వారు రెడీ అవుతున్నారు. ఇందుకు సంబంధించి.. వీటిని ఎలా వాడాలో వీరితో బాటు పోలీసులు కూడా హాంకాంగ్-చైనా బోర్డర్ లో శిక్షణ పొందుతున్న దృశ్యాలను చైనా పత్రికలు ఫొటోలుగా ప్రచురించాయి. ఈ ఫోర్క్ లు శరీరానికి తగలగానే బొబ్బలెక్కి ఒళ్ళు తీవ్రంగా […]

హాంకాంగ్ నిరసనకారులకు ఎలక్ట్రిక్ షాక్‌లు.. చైనా సైనికుల వ్యూహం
Follow us

|

Updated on: Aug 17, 2019 | 2:22 PM

హాంకాంగ్ లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న ఆందోళనకారులను అదుపు చేసేందుకు చైనా సైనికులు అమానుష పధ్ధతులకు పాల్పడబోతున్నారు. ప్రొటెస్టర్లకు విద్యుత్ షాక్ లు ఇచ్ఛే 8 అడుగుల పొడవైన భారీ ఫోర్క్ లను వాడేందుకు వారు రెడీ అవుతున్నారు. ఇందుకు సంబంధించి.. వీటిని ఎలా వాడాలో వీరితో బాటు పోలీసులు కూడా హాంకాంగ్-చైనా బోర్డర్ లో శిక్షణ పొందుతున్న దృశ్యాలను చైనా పత్రికలు ఫొటోలుగా ప్రచురించాయి. ఈ ఫోర్క్ లు శరీరానికి తగలగానే బొబ్బలెక్కి ఒళ్ళు తీవ్రంగా కాలుతుంది. వీటిని భరించలేక నిరసనకారులు పారిపోవడం తథ్యమని ఈ పత్రికలు పేర్కొన్నాయి. క్రౌడ్ కంట్రోల్ ఎక్సర్ సైజ్ పేరిట సైనికులు, పోలీసులు ఈ ‘ కిరాతక ‘ వ్యూహం చేబట్టారు. నేరస్థుల అప్పగింత బిల్లుకు నిరసనగా హాంకాంగ్ లో నిరసనకారులు భారీ ఎత్తున ఆందోళనలను కొనసాగిస్తున్నారు. లక్షల మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి .. ముఖ్యంగా పార్లమెంటు ఎదుట ప్రొటెస్ట్ చేస్తున్న దృశ్యాలు సర్వసాధారణమయ్యాయి.

‘ పవర్ టు ది పీపుల్ ‘ పేరిట శుక్రవారం రాత్రి కూడా వీరు భారీ ర్యాలీ నిర్వహించారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. అయితే వీరి ఆందోళనను చైనా సీరియస్ గా పరిగణిస్తోంది. వందలాది యుధ్ధ శకటాలను, సైనికులను సరిహద్దుల్లో మోహరించింది. కేవలం 10 నిముషాల్లో హాంకాంగ్ పై దాడికి దిగుతామని హెచ్ఛరించింది. దీనిపై అమెరికా.. చైనా మీద మండిపడింది. దీనివల్ల సమస్య మరింత జటిలమవుతుందని పేర్కొంది. సైనికుల మోహరింపు వల్ల ప్రయోజనం ఉండకపోగా,, వ్యతిరేక ఫలితాలు వస్తాయని వార్నింగ్ ఇచ్చింది. అటు-నిరసనకారులకు విద్యుత్ షాక్ లు ఇచ్ఛే ఫోర్క్ లను వాడరాదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కూడా చైనాను కోరింది. ఇలాంటి అమానుష పధ్ధతుల వల్ల పరిస్థితి మరింత విషమిస్తుందని ఆ సంస్థ సైతం హెచ్ఛరించడం విశేషం.

మరోవైపు-తాను చైనా వైఖరిని సమర్థిస్తానని ప్రముఖ నటుడు జాకీ చాన్ ప్రకటించి మరో వివాదాన్ని రేపాడు. చైనీయుడనైనందుకు తాను గర్వపడుతున్నానని, తన మాతృ భూమిని ఎంతగానో అభిమానిస్తున్నానని, కానీ హాంకాంగ్ లో జరుగుతున్న పరిణామాలు తననెంతో బాధిస్తున్నాయని ఆయన పేర్కొన్నాడు. చైనా సార్వభౌమాధికారాన్ని పరిరక్షించేందుకు అందరూ తనతో చేతులు కలపాలని ఆయన కోరాడు. ఇందుకు హాంకాంగ్ నిరసనకారులు అతనిపై విరుచుకపడ్డారు. కమ్యూనిస్టు పార్టీ ఇఛ్చిన ‘ పిల్ ‘ తిని జాకీ చాన్ అవాకులు, చెవాకులు పేలుతున్నాడని వారు ఆరోపించారు. అతడిని హాంకాంగ్ లో అడుగు పెట్టనివ్వబోమని హెచ్చరించారు.