USA: యూఎస్‌లోకి విషపూరిత ఫంగస్ అక్రమ రవాణా.. చైనా PhD స్టూడెంట్ అరెస్ట్
అమెరికా వర్సెస్ చైనా. ఒకవైపు అమెరికా టారిఫ్ లతో చైనాను టార్గెట్ చేస్తుంటే.. చైనా సైంటిస్టులు మాత్రం బయోవెపన్‌లతో యూఎస్‌ను టార్గెట్ చేస్తున్నారు. కరోనా వైరస్ చైనా ల్యాబ్స్ నుంచి బయటకు రావటం వల్ల జరిగిన ప్రమాదం నుంచి ఇంకా ప్రపంచ బయటపడక ముందే మరోసారి అలాంటి కుట్ర ఒకటి వెలుగులోకి వచ్చింది. కంత్రీ కంట్రీ బయోవార్‌కు తెగించిందా..?

కన్నింగ్ డ్రాగన్ కంట్రీ.. మరో డేంజరస్ గేమ్‌కు తెరతీసిందా.. ప్రమాదకరమైన ఫంగస్‌తో బయో వార్‌కు ప్లాన్ చేసిందా.. యస్..! అమెరికాలో మరో చైనా సైంటిస్ట్ అరెస్ట్‌తో ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూఎస్‌లోకి విషపూరిత ఫంగస్‌ను అక్రమంగా రవాణా చేస్తూ ఇద్దరు చైనా శాస్త్రవేత్తలు పట్టుబడిన వారం రోజుల వ్యవధిలోనే మరో సైంటిస్ట్ బయోలాజికల్ మెటీరియల్‌ను తీసుకొస్తూ పట్టుబడటం అమెరికా అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. వరుసగా జీవసంబంధిత పదార్థాలను అమెరికాలోకి రవాణా చేస్తూ పట్టుబడుతుండటంతో దీని వెనుక ఏదో కుట్ర ఉందని అనుమానిస్తున్నారు అమెరికా అధికారులు.
చెంగ్‌జాన్ హన్‌ను అరెస్ట్ చేసిన అమెరికా FBI
చైనా వుహాన్‌లోని హువాజోంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన పీహెచ్‌డీ స్టూడెంట్ చెంగ్‌జాన్ హన్‌ను అమెరికా FBI అధికారులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి నులిపురుగులను పోలిన జీవపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అమెరికాలోని మిచిగన్ వర్సిటీలో పనిచేస్తున్న నలుగురికి చైనా పరిశోధకురాలు నాలుగు పార్సిల్స్ పంపినట్లు తెలుస్తోంది. ప్రతి ప్యాకేజీలో రౌండ్‌వార్మ్‌లకు సంబంధించిన జీవసంబంధమైన పదార్థాలు ఉన్నాయి. ఆ పార్సిల్స్ తీసుకొని హాన్ అమెరికాకు రావడానికి కొన్ని రోజుల ముందు ఎలక్ట్రానిక్ పరికరాల్లోని డేటాను తొలగించినట్లు గుర్తించారు. అంతేకాదు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధాలు ఉన్న వ్యక్తులు, ముఖ్యంగా US విద్యాసంస్థలలోని చైనా జాతీయులు ఈ బయోలాజికల్ స్మగ్లింగ్‌లో సంబంధం ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.
Yesterday, @FBIDetroit arrested a second Chinese national on charges of smuggling biological materials into the U.S. and lying to federal agents.
This individual is Chengxuan Han, a citizen of the People’s Republic of China and a Ph.D. student in Wuhan, China. Han is the third… pic.twitter.com/TE4tJgtJQi
— FBI Director Kash Patel (@FBIDirectorKash) June 9, 2025
ఇటీవల ఇద్దరు చైనీయుల అరెస్ట్
ఇటీవల ఇదేవిధంగా బయోలాజికల్ గూడ్స్ స్మగింగ్ చేస్తున్న ఇద్దరు చైనీయులను అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు. దీన్ని తీవ్రమైన జాతీయభద్రతా ముప్పుగా ప్రకటించిన దర్యాప్తు చేస్తోంది ఎఫ్‌బీఐ. వీళ్ల దగ్గర దొరికిన ఫుసేరియం గ్రామినీరమ్ అనే ఫంగస్‌పై లోతుగా పరిశోధిస్తోంది ఎఫ్‌బీఐ. యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్‌లోని ల్యాబొరేటరీ వర్క్ కోసమే ఈ ఫంగస్ తెచ్చుకున్నట్టు నిందితులు చెబుతున్నారు. కానీ.. డేంజరస్ బయొలాజికల్ స్మగ్లింగ్ చేసి.. అగ్రో టెర్రరిజానికి పాల్పడ్డారా అనే కోణంలో జరుగుతోంది దర్యాప్తు. ఆగ్రోటెర్రరిజం అంటే ఒక దేశపు వ్యవసాయాన్ని చంపెయ్యడం. శత్రుదేశంలో ఆహార కొరతను సృష్టించి.. తద్వారా సామాజిక అశాంతిని పెంచడం.. ఇదీ లక్ష్యం. ఇందుకోసం వ్యవసాయ రంగంలోకి తెగుళ్ళు, వ్యాధులు, వ్యాధికారకాల్ని ఉద్దేశపూర్వకంగా ప్రవేశపెడతారు. 30 ఏళ్లకిందట ఈ తెగులు బారిన పడింది అమెరికా. ఇప్పుడు చైనా కొత్తగా మొదలుపెట్టడంతో ఎఫ్‌బీఐ అప్రమత్తమైంది. జాతీయ భద్రతకు మోస్ట్ డేంజరస్ సిట్యువేషన్‌గా ప్రకటించింది.
ఇదంతా చూస్తుంటే అమెరికా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు చైనా కమ్యూనిస్ట్ పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ చర్యలు అమెరికా ఆహార భద్రతతో పాటు అక్కడి ప్రజల ప్రాణాలకు ప్రమాదం కలిగించేందిగా ఉందని యూస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే చైనా ఇలాంటి ప్రయత్నాలను ఇంకా ఎన్ని దేశాల్లో అమలు చేస్తుందో ఇప్పటి వరకు తెలియదు.