China Population: ప్రపంచంలోనే అతి ఎక్కువ జనాభా కలిగిన దేశం చైనా. అయితే ఈ దేశంలో గత కొన్ని ఏళ్లుగా జననాల రేటు దారుణంగా పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక జనాభా నియంత్రణ కోసం ప్రవేశ పెట్టిన ఒకే బిడ్డ విధానాన్ని ఆ దేశం 2016లో విడిచి పెట్టింది. అంతేకాదు ఒకరికంటే ఎక్కువ పిల్లలను జన్మినిచ్చే తల్లిదండ్రులకు ప్రోత్సాహకాలను అందించడమే కాదు.. పన్నులో కూడా రాయితీనిచ్చింది. ఒక్కరు వద్దు.. ముగ్గురు ముద్దు అనే విధాన్ని ప్రవేశపెట్టినప్పటికీ చైనా జనాభా తగ్గిపోతోందని తాజాగా గణాంకాల వలన తెలుస్తోంది. ప్రపంచ జనాభాలో చైనా ఆరవ వంతు కంటే ఎక్కువ. రానున్న 80 ఏళ్లలో దేశ జనాభాలో సగానికి సగం తగ్గిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చైనా జనాభా 660 మిలియన్ల నుండి 1.4 బిలియన్లకు పెరిగిన నాలుగు దశాబ్దాల అనంతరం అంటే ఆ దేశ జనాభా 1959-1961 నాటి మహా కరువు తర్వాత మొదటిసారిగా ఈ ఏడాది జనాభ పెరుగుదల తగ్గుముఖం పట్టింది. చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ తాజా గణాంకాల ప్రకారం కఠినమైన కోవిడ్ నిరోధక చర్యల నేపథ్యంలో పిల్లలను కనేందుకు ఇష్టపడకపోవడమే జననాల మందగమనానికి దోహదపడి ఉండవచ్చనని అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఆ దేశంలో జనాభావృద్ధి తగ్గుదల చాలా సంవత్సరాలుగా వస్తోంది. 2021లో చైనా జనాభా 1.41212 బిలియన్ల నుండి కేవలం 1.41260 బిలియన్లకు పెరిగింది. ఇది కేవలం 480,000 తక్కువ పెరుగుదల.. ఇది దశాబ్దం క్రితం ఎనిమిది మిలియన్ల వార్షిక వృద్ధిలో కేవలం ఒక భాగం మాత్రమే అని గణాంకాల ద్వారా తెలుస్తోంది.
చైనాలో మహిళల సంతానోత్పత్తి రేటు 1980 చివరలో 2.6 శాతంగా ఉన్నప్పటికీ… క్రమంగా తగ్గుతూ 1994లో 1.6 నుంచి 1.7 మధ్య ఉంది. ఇక 2020లో 1.3 కి చేరుకుంది. ఇక గత ఏడాదిలో 1.15 కి పడిపోయింది. సంతానోత్పత్తి రేటు ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్‌లో పోలిస్తే.. క్రమంగా చైనాలో తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే 40 ఏళ్ల అనంతరం చైనా జనాభా దారుణంగా పడిపోనున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పిల్లలు వద్దు అంటున్న చైనా దంపతులు:
2016లో చైనా తన ఒక బిడ్డ విధానాన్ని రద్దు చేసింది. ఇక ముగ్గురు పిల్లలను కన్న తల్లిదండ్రులకు ఇతర ప్రోత్సాహకాలను గత ఏడాది ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయినప్పటికీ ఇక్కడ మహిళలు పిల్లలను కనడానికి ఇష్టపడడం లేదు. దీని అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పటికే చిన్న కుటుంబానికి అలవాటు పడడం, రోజు రోజుకీ పెరుగుతున్న ఖర్చులు, జీవన వ్యయం, తగ్గుతున్న ఆదాయం లతో పాటు.. ముఖ్యంగా పెళ్లి చేసుకోవడానికి ఆసక్తిని చూపించకపోవడమతో పెరుగుతున్న వివాహ వయస్సు ఇవన్నీ జనాభా తగ్గుదలకు కారణం అని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాదు.. చైనాలో అమ్మాయిల కంటే అబ్బాయిల సంఖ్య అధికంగా ఉన్నట్లు లెక్కల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా చైనాలో జనాభా పెరుగుదలను అరికట్టడానికి 1980లో ప్రవేశ పెట్టిన ఒకే బిడ్డ నినాదం ఈ జనాభా నిష్పత్తి రేటులో తేడా కలగడానికి ఓ కారణం అని తెలుస్తోంది.
ఒకే బిడ్డను కనాల్సి వచ్చినపుడు.. దేశంలో ఎక్కువ జంటలు అబ్బాయిని ఎంచుకున్నారు. దీని ఫలితంగా ఇప్పుడు 100 మంది బాలికలకు 120 నుంచి 130 మంది అబ్బాయిలు ఉన్నట్లు గణంకాలు ద్వారా తెలుస్తోంది.
ఇలా చైనాలో జనాభా తగ్గుదల.. వృద్ధ జనాభా పెరుగుదల.. యువత తక్కువ అవ్వడం వంటి అనేక కారణాల వలన ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జనాభా వృద్ధి రేటు క్షిణిస్తున్న తరుణంలో 2080నాటికి డ్రాగన్ కంట్రీలో పనిచేసే యువత భారీ తగ్గనున్నదని.. దీంతో చైనా ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటుందన్నది ఆర్ధిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..