China: పెను ప్రమాదంలో చైనా.. భారీగా జనాభా క్షీణత.. కొన్నేళ్ల తర్వాత 1950 నాటి జనాభా సమానం..

|

Jul 28, 2024 | 3:23 PM

జూలై ప్రారంభంలో విడుద చేసిన ఐక్యరాజ్యసమితి నివేదిక చైనాలో ఏర్పడనున్న పెను సంక్షోభం గురించి హెచ్చరించింది. దీనిలో 2024 నుంచి 2054 సంవత్సరాల మధ్య చైనా భారీగా జనాభా నష్టాన్ని చవిచూస్తుందని చెప్పబడింది. చైనా ప్రస్తుతం జనాభా క్షీణతతో పోరాడుతోంది. చాలా కాలంగా ఈ సమస్య నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదు.

China: పెను ప్రమాదంలో చైనా.. భారీగా జనాభా క్షీణత.. కొన్నేళ్ల తర్వాత  1950 నాటి జనాభా సమానం..
China Population
Image Credit source: Adam Adada
Follow us on

గత కొన్ని ఏళ్ల క్రితం వరకూ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా. జనాభా నియంత్రం కోసం ఎన్నో చట్టాలను చేసింది. అయితే ఇప్పుడు పిల్లలను కనమంటూ తమ దేశ ప్రజలను వేడుకొంటుంది ఆ దేశ ప్రభుత్వం. డ్రాగన్ కంట్రీలో 2022 సంవత్సరం నుంఛి అత్యధిక జనాభా జాబితా నుంచి క్రమంగా దిగజారడం ప్రారంభించింది. అప్పటి నుంచి చైనా దేశం జనాభా క్షీణతకు గురవుతోంది. ఎంత దారుణంగా జనాభా తగ్గుతుందంటే.. 2100 సంవత్సరం నాటికి చైనా జనాభా 1950ల జనాభాతో సమానంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి ఇటీవలి ఒక నివేదికలో పేర్కొంది.

జూలై ప్రారంభంలో విడుద చేసిన ఐక్యరాజ్యసమితి నివేదిక చైనాలో ఏర్పడనున్న పెను సంక్షోభం గురించి హెచ్చరించింది. దీనిలో 2024 నుంచి 2054 సంవత్సరాల మధ్య చైనా భారీగా జనాభా నష్టాన్ని చవిచూస్తుందని చెప్పబడింది. చైనా ప్రస్తుతం జనాభా క్షీణతతో పోరాడుతోంది. చాలా కాలంగా ఈ సమస్య నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదు. ప్రభుత్వం కూడా పిల్లల జననం, పెంపకం కోసం అనేక పథకాలను ప్రారంభించింది. అయినప్పటికీ తేడా కనిపించడం లేదు.

 

ఇవి కూడా చదవండి

 

2023లో చైనాలో అత్యల్ప జనన రేటు

గత 2 సంవత్సరాలుగా జనాభా తగ్గుతోంది. అంటే 2.08 మిలియన్ల తగ్గుదల నమోదైంది. చైనా జనాభా 1.4097 బిలియన్లకు తగ్గిందని నివేదికలో పేర్కొంది. 1949లో ప్రారంభమైన జనాభా లెక్కల నివేదిక ఆధారంగా 2023లో చైనాలో అత్యల్పంగా 9.02 మిలియన్ల జననాలు నమోదయ్యాయి. చైనాలో ఈ జనాభా క్షీణతకు కారణం చైనాలో ప్రజలు వివాహం ఆలస్యంగా చేసుకోవడమే.. పెళ్లి అలస్యంగా చేసుకోవడం జనాభా తగ్గుతోంది, దీనిని సైన్స్ భాషలో అర్థం చేసుకుంటే.. ఆలస్యంగా వివాహం చేసుకోవడం వల్ల మహిళల్లో పునరుత్పత్తి సామర్ధ్యం తగ్గుతుంది. దీంతో జననాల రేటు భారీగా తగ్గుతోంది.

జనాభా క్షీణతకు కారణం ఏమిటంటే

జనాభా క్షీణతకు రెండవ అతిపెద్ద కారణం ఏమిటంటే ఈ రోజుల్లో చాలా మంది యువతకు తమ జీవితం గురించి అనేక ప్రశ్నలు ఉన్నాయి. తమ వృత్తిలో ముందుకు వెళ్ళడానికి బాధ్యతలను తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. అంతేకాదు స్త్రీలు పిల్లల బాధ్యత నుండి తప్పుకుంటున్నారు. ఇదే విధంగా జనాభా క్షీణత సమస్య చైనా తర్వాత, జపాన్ , రష్యాలు కూడా ఎదుర్కొనవచ్చు అని నివేదికలో వెల్లడి అయింది.

 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..