China: నోటి ద్వారా కరోనా టీకా.. బూస్టర్ డోస్ గా పంపిణీ.. అంతే కాకుండా..

|

Oct 27, 2022 | 7:21 AM

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి వ్యాప్తి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రావడం, కరోనా సంబంధిత టీకా ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుండటంతో కొవిడ్..

China: నోటి ద్వారా కరోనా టీకా.. బూస్టర్ డోస్ గా పంపిణీ.. అంతే కాకుండా..
Oral Corona Vaccine
Follow us on

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి వ్యాప్తి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రావడం, కరోనా సంబంధిత టీకా ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుండటంతో కొవిడ్ వ్యాప్తి కట్టడైంది. ఈ క్రమంలో వైద్యులు మరో మైలురాయిని అందుకున్నారు. ఇప్పటి వరకు సూది ద్వారా కరోనా వ్యాక్సిన్ అందిస్తుండగా.. ఇక నుంచి సూది అవసరం లేకుండానే వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. నోటి ద్వారా తీసుకునే కరోనా టీకా పంపిణీని చైనా ప్రారంభించింది. షాంఘై నగరంలో పంపిణీ చేస్తోన్న ఈ తరహా వ్యాక్సిన్‌ ప్రపంచంలోనే మొదటిగా భావిస్తున్నారు. నోటి ద్వారా తీసుకునే ఈ వ్యాక్సిలోని ద్రవాన్ని నోటితో పీల్చాల్సి ఉంటుంది. ఐదు సెకన్ల పాటు ఊపిరి తీసుకోవాలి. ప్రక్రియ మొత్తం 20 సెకన్లలోనే ముగుస్తుంది. దీనిని బూస్టర్‌ డోసుగా పంపిణీ చేస్తున్నామని చైనా అధికారులు వెల్లడించారు. సూదితో వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ఇష్టపడని వారికి, పేద దేశాలకు ఇది ఎంతో దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. చైనా బయోఫార్మా సంస్థ కాన్‌సినో బయోలాజిక్స్‌ ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసింది.

ఈ టీకా తీసుకుంటే ఒక కప్పు టీ తాగినట్లే ఉందని షాంఘై వాసి ఒకరు తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇన్‌హేలర్‌ లాగా నోటి ద్వారా తీసుకొనే ఈ టీకాను బూస్టర్‌ డోసుగా ఉచితంగా ఇస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. చైనా, హంగేరీ, పాకిస్తాన్‌, మలేషియా, అర్జెంటీనా, మెక్సికో దేశాల్లో పూర్తి చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. దీనిని బూస్టర్‌ డోసుగా ఉపయోగించేందుకు చైనా ఔషధ నియంత్రణ సంస్థలు సెప్టెంబర్‌లోనే అనుమతి ఇచ్చాయి. ఈ క్రమంలో తాజాగా వీటి పంపిణీని ప్రారంభించారు. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా 12 నాజల్‌ వ్యాక్సిన్లు ప్రయోగ దశల్లో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

కాగా.. గతంలో నోటి ద్వారా తీసుకునే టీకా పట్ల నిపుణులు పరిశోధనలు చేశారు. ఈ రకమైన టీకా వ్యాధి నుంచి రక్షణ కల్పించడంతో పాటు ఇతరులకు వైరస్‌ సోకకుండా నిరోధించడంలోనూ మెరుగ్గా పని చేస్తున్నట్లు గుర్తించారు. అమెరికాలోని డ్యూక్‌ యూనివర్సిటీ మెడికల్‌ సెంటర్‌కు చెందిన పరిశోధకులు ఈ పరిశోధన నిర్వహించారు. అడినో వైరస్‌ను వాహకంగా ఉపయోగించుకునేలా రూపొందించిన ఓ కొవిడ్‌ టీకాను పరీక్షించారు. ఈ వ్యాక్సిన్‌ను మాత్ర రూపంలో నోటి ద్వారా తీసుకోవచ్చు. రక్తం, ఊపిరితిత్తుల్లో సమర్థ యాంటీబాడీలను తయారుచేయడం ద్వారా కొవిడ్‌ నుంచి అది రక్షణ కల్పిస్తున్నట్లు పరిశోధకులు స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..