China: జిన్‌పింగ్ కు టెన్షన్ తెప్పిస్తున్న మహిళలు.. ఎన్నిప్రోత్సహాలు ఇచ్చినా పెళ్లి, పిల్లలకు దూరం..

జిన్‌పింగ్ ప్రభుత్వం అనేక వివాహ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సైనిక కుటుంబాలను ఎక్కువ మంది పిల్లలకు జన్మ నిచ్చేవిధంగా ప్రోత్సహించే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఆ తరువాత చైనాలోని సైనికులు రెండవ, మూడవ బిడ్డకు జన్మనివ్వడంలో.. జాతీయ సంతానోత్పత్తి విధానాన్ని అమలు చేయడంలో ఇప్పటికే ముందంజలో ఉన్నారు. ఒకప్పుడు పసి పిల్లలపై దృష్టి సారించిన వ్యాపార సంస్థలు.. ఇప్పుడు వృద్ధులపై దృష్టి సారిస్తున్నాయి. పిల్లల సంరక్షణ కోసం నిర్మించిన అనేక కొత్త కిండర్ గార్టెన్‌లు విద్యార్థుల కొరత కారణంగా మూతపడ్డాయి. చైనాలో ప్రీస్కూల్ విద్యాసంస్థల సంఖ్య 2022లో 2% తగ్గింది.

China: జిన్‌పింగ్ కు టెన్షన్ తెప్పిస్తున్న మహిళలు.. ఎన్నిప్రోత్సహాలు ఇచ్చినా పెళ్లి, పిల్లలకు దూరం..
China Jinping
Follow us
Surya Kala

|

Updated on: Jan 04, 2024 | 9:55 AM

చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య వృద్ధాప్య జనాభా. ఓ వైపు నవజాత శిశువుల జనన సంఖ్య తగ్గుతోంది. మరోవైపు వృద్దుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒకప్పుడు జనాభాలో ప్రపంచంలోనే నెంబర్ 1 గా ఉన్న చైనా.. ఇప్పుడు జనాభా పతనం దిశగా పయనిస్తోంది. 2022లో చైనాలో నవజాత శిశువుల సంఖ్య 10 మిలియన్ల కంటే తక్కువగా ఉంది. అయితే పదేళ్ళ క్రితం అంటే 2012లో ఈ సంఖ్య దాదాపు 16 మిలియన్లుగా ఉంది. కొన్ని అంచనాల ప్రకారం చైనా ప్రస్తుత జనాభా 1.4 బిలియన్లు.. ఇదే పరిస్తితులు కొనసాగితే 2100 నాటికి డ్రాగన్ కంట్రీ జనాభా దాదాపు 500 మిలియన్లకు తగ్గవచ్చు. అక్కడ మహిళలు పిల్లలను కనేందుకు సిద్ధంగా లేరని చెబుతున్నారు.

అక్టోబర్‌లో ప్రభుత్వం మద్దతు ఉన్న ఆల్-చైనా మహిళా సమాఖ్యతో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మాట్లాడుతూ..”మహిళలతో ఈ సమస్యను పరిష్కరించాలని” కోరారు. బలహీనమైన ఆర్థిక వ్యవస్థ, రోజు రోజుకీ పెరుగుతున్న నిరుద్యోగంతో పాటు చైనా యువత భిన్నమైన జీవన శైలిని అలవాటు చేసుకున్నారు. తమ ముందు తరం తల్లిదండ్రుల తరం కంటే భిన్నమైన ఆలోచనలు కలిగి ఉన్నారు.

వివాహానికి దూరంగా మహిళలు

వివాహం, సంతానం తమ ఉన్నతికి అడ్డు అని చాలామంది మహిళలు భావిస్తున్నారు. ఒక బిడ్డ అది కూడా ఆడపిల్ల మాత్రమే ఉన్న తల్లిదండ్రులకు సంరక్షణకు సమయం దొరకడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లయితే తన భర్తకు, బిడ్డకు సమయం ఇవ్వడం కుదరదని భావిస్తున్న చైనా మహిళలు పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొందరు.

ఇవి కూడా చదవండి

ఒక బిడ్డ విధానానికి స్వస్తి చెప్పిన ప్రభుత్వం

2015లో చైనా ప్రభుత్వం తన 35 ఏళ్ల వన్-చైల్డ్ పాలసీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించినప్పుడు.. అధికారులు బేబీ బూమ్‌ను అంచనా వేశారు. ఇందుకోసం ప్రభుత్వం కొత్తగా ప్రసూతి వార్డులను భారీగా నిర్మించింది. అయితే అనుకున్నట్లుగా శిశి జననాలు లేకపోవడంతో ఈ వార్డులు ప్రారంభించిన కొన్నాళ్లకే మూతపడ్డాయి. అప్పుడు పసి పిల్లలపై దృష్టి సారించిన వ్యాపార సంస్థలు.. ఇప్పుడు వృద్ధులపై దృష్టి సారిస్తున్నాయి. పిల్లల సంరక్షణ కోసం నిర్మించిన అనేక కొత్త కిండర్ గార్టెన్‌లు విద్యార్థుల కొరత కారణంగా మూతపడ్డాయి. చైనాలో ప్రీస్కూల్ విద్యాసంస్థల సంఖ్య 2022లో 2% తగ్గింది.

గణాంకాలు ఏం చెబుతున్నాయి?

  1. 2023 నాటికి చైనాలో జననాల సంఖ్య 9 మిలియన్లకు తగ్గుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
  2. 2023 నాటికి భారతదేశంలో జననాల సంఖ్య 23 మిలియన్లకు చేరుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
  3. చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది.
  4. 2023లో యునైటెడ్ స్టేట్స్‌లో దాదాపు 3.7 మిలియన్ల పిల్లలు పుడతారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
  5. చైనా జనాభా సమస్యకు కారణం ఒక బిడ్డ విధానం అని భావిస్తున్నారు. చైనాలో మునుపటి కంటే తక్కువ సంఖ్యలో యువతీ యువకులు ఉన్నారు.
  6. చైనాలో మహిళలు వివాహం చేసుకోవడానికి.. పిల్లలను కనడానికి ఇష్టపడడం లేదు. దీంతో ఆ దేశంలో జనాభా క్షీణతను వేగవంతం అవుతోంది.
  7. చైనాలో 2013లో 13 మిలియన్ల జంటలు పెళ్లి కోసం నమోదు చేసుకోగా.. 2022లో 6.8 మిలియన్ల జంటలు వివాహానికి నమోదు చేసుకున్నారు.
  8. చైనాలో మొత్తం సంతానోత్పత్తి రేటు 2022లో జనాభా స్థిరంగా ఉంచడానికి అవసరమైన 2.1 కంటే చాలా తక్కువగా ఉంటుంది.

ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రోత్సహం

జిన్‌పింగ్ ప్రభుత్వం అనేక వివాహ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సైనిక కుటుంబాలను ఎక్కువ మంది పిల్లలకు జన్మ నిచ్చేవిధంగా ప్రోత్సహించే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఆ తరువాత చైనాలోని సైనికులు రెండవ, మూడవ బిడ్డకు జన్మనివ్వడంలో.. జాతీయ సంతానోత్పత్తి విధానాన్ని అమలు చేయడంలో ఇప్పటికే ముందంజలో ఉన్నారు.

చైనీస్ వంశావళిని కొనసాగించండి

ఆగస్టులో చైనాలోని జియాన్ నివాసితులు, చైనీస్ వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రభుత్వ అధికారుల నుంచి స్వయంచాలక శుభాకాంక్షలను అందుకున్నారని చెప్పారు. ఇక మరోవైపు “చైనీస్ వాలెంటైన్స్ డే సమీపిస్తున్నందున.. మధురమైన ప్రేమను, వయస్సుకు తగిన సమయంలో వివాహాన్ని కోరుకుంటున్నాను” అని రాసి శుభాకాంక్షలు చెప్పారు. మంచి ఆరోగ్య కరమైన పిల్లల్ని కని , చైనీస్ వంశాలను కొనసాగించండి. పునరుజ్జీవనమనే ముఖ్యమైన పనిని భాగస్వామ్యం చేయండి!

ఎక్కువ మంది పిల్లలను కన్నవారికి నగదు ప్రోత్సాహకం

చైనాలోని కొన్ని స్థానిక ప్రభుత్వాలు రెండవ లేదా మూడవ బిడ్డను కలిగి ఉన్న జంటలకు నగదు ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. జెజియాంగ్ ప్రావిన్స్‌లోని ఒక కౌంటీ 25 ఏళ్లలోపు వివాహం చేసుకున్న ప్రతి జంటకు 1,000 యువాన్ల నగదు బహుమతిని అందిస్తుంది. 2015కి ముందు చైనాలో వన్ చైల్డ్ పాలసీ అమలులోకి వచ్చిన సమయంలో స్త్రీలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎవరైనా అనుకోకుండా గర్భం దాల్చినట్లయితే.. ఆమెకు బలవంతంగా అబార్షన్ చేసేవారు.

అంతేకాదు కొందరు ప్రభుత్వం నుంచి దాచిపెట్టి రెండో బిడ్డకు జన్మనిస్తే.. అది ప్రభుత్వం దృష్టికి వెళ్తే.. 10 వేల డాలర్ల వరకు భారీగా జరిమానా విధిస్తారు. ఇప్పుడు ప్రభుత్వం పిల్లలను కనాలని ప్రోత్సహిస్తున్నారు. SMS కూడా పంపుతున్నారు. అయినప్పటికీ పురుషులు, మహిళలు ప్రభుత్వం విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ